India vs Australia: స్వదేశంలో అశ్విన్ తిరుగులేని రికార్డు!
ABN, First Publish Date - 2023-03-10T19:41:51+05:30
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా(Australia)తో
అహ్మదాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా(Australia)తో నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు(Ahmedabad Test) రెండో రోజు మరోసారి తిప్పేసిన అశ్విన్ మొత్తంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 32వ సారి. ఈ టెస్టులో ఐదు వికెట్లు తీసేందుకు అశ్విన్ 47 ఓవర్లు వేశాడు. ఈ క్రమంలో అతడు మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడం ద్వారా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను అశ్విన్ వెనక్కి నెట్టేశాడు.
తొలి మూడు టెస్టుల్లోనూ అలవోకగా వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఈ మ్యాచ్‌లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్లను కదిలించేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు.
కుంబ్లే రికార్డు బద్దలు
అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్.. కుంబ్లే రికార్డును బద్దలుగొట్టాడు. టెస్టుల్లో సొంతగడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అశ్విన్‌కు ఇది 26వ సారి. ఫలితంగా 25సార్లు ఆ ఘనత సాధించిన కుంబ్లేను వెనక్కి నెట్టేశాడు. రెండో 41వ ఓవర్లో టాడ్ మర్ఫీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును తన పేర రాసుకున్నాడు.
సొంతగడ్డపై వీరే వీరులు
* ముత్తయ్య మురళీధరన్ 73 మ్యాచుల్లో 45 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు
* రంగన హెరాత్ 49 మ్యాచుల్లో 26 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు
* రవిచంద్రన్ అశ్విన్ 56 మ్యాచుల్లో 26 సార్లు ఆ ఘనత అందుకున్నాడు
* అనిల్ కుంబ్లే 53 మ్యాచుల్లో 25 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
Updated Date - 2023-03-10T20:04:15+05:30 IST