IND vs SL: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. నిలకడగా రాణిస్తున్న టీమిండియా
ABN, First Publish Date - 2023-01-10T14:47:57+05:30
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా (IND vs SL) నిలకడగా రాణిస్తోంది. లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు..
గౌహతి: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా (IND vs SL) నిలకడగా రాణిస్తోంది. లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు (Team India) ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Gill) శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ హాఫ్ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా 40 పరుగులు చేసి హాఫ్ సెంచరీ దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ 40(40), రోహిత్ శర్మ 55(44) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా 14 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 95 పరుగులు సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. అందుకే యువ భారత్ చెలరేగిన తరహాలోనే శ్రీలంకపై ఇప్పుడు రోహిత్ ఆధ్వర్యంలోని వన్డే టీమ్ కూడా విరుచుకు పడాలని ఫిక్స్ అయింది.
రోహిత్, గిల్ ఆశించిన విధంగానే రాణిస్తుండటం గమనార్హం. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లతో పాటు పలువురు సీనియర్లకు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. 2015 నుంచి శ్రీలంకతో పూర్తిగా జరిగిన 13 వన్డేల్లో భారత్ 10-3తో ఆధిక్యంలో ఉంది. అటు 2020 నుంచి సొంతగడ్డపై జరిగిన 12 వన్డేల్లో భారత్ 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. మరోవైపు లంక కూడా ఈ ఫార్మాట్‌లో గతేడాది ఆడిన 10 వన్డేల్లో ఆరింటిని నెగ్గింది.
Updated Date - 2023-01-10T17:31:42+05:30 IST