కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

ABN, First Publish Date - 2023-10-29T21:50:12+05:30

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా.. 129 పరుగులకే మన బౌలర్లు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. నిజానికి.. లక్ష్యం చిన్నదే కావడంతో ఇంగ్లండ్ జట్టు సునాయాసంగా దాన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా మన భారత బౌలర్లు వాళ్లకు చుక్కలు చూపించారు. లక్ష్యానికి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా.. 129 పరుగులకే పరిమితం చేసి, భారత జట్టుకి అపూర్వమైన విజయాన్ని అందించారు.


లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (87) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుని ఆదుకోవడం.. సూర్యకుమార్ యాదవ్ (49), కేఎల్ రాహుల్ (39) మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ ఈసారి చేతులెత్తేశారు. చివర్లో బుమ్రా (16) కూడా తనవంతు సహాయం అందించాడు. ఇక 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లలో ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. లివింగ్‌స్టోన్ ఒక్కడే 27 వ్యక్తిగత పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచారు. జో రూట్, బెన్ స్టోక్స్ వంటి మేటి ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.

ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. మరోసారి మహమ్మద్ షమీ తన సత్తా చాటాడు. ఏడు ఓవర్లో వేసిన అతగాడు కేవలం 22 పరుగులే ఇచ్చి, 4 వికెట్లు తీసి, ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తాడని అనుకున్నారు కానీ, ఆ అవకాశం మిస్సయ్యింది. అందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఇక బుమ్రా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

Updated Date - 2023-10-29T21:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising