ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs NZ: ప్రతీకారం తీర్చుకున్న భారత్.. న్యూజిలాండ్‌పై విజయం

ABN, First Publish Date - 2023-10-22T22:21:15+05:30

ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి, విజయఢంకా మోగించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చివరివరకూ క్రీజులో నిల్చొని సమర్థవంతంగా..

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి, విజయఢంకా మోగించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (95) చివరివరకూ క్రీజులో నిల్చొని సమర్థవంతంగా రాణించడం, ఇతర ప్లేయర్లు కూడా డీసెంట్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ ఈ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. ముఖ్యంగా.. ఈ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ హీరోగా నిలిచాడని చెప్పుకోవచ్చు. తాను ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, కివీస్ బౌలర్లను చాకచక్యంగా ఎదుర్కుంటూ.. జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ.. శతకం చేయలేకపోయాడన్న వెలితి అతనితో పాటు భారతీయ అభిమానులకూ ఉంది.


తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డేరిల్ మిచెల్ (130) శతక్కొట్టడం, రచిన్ రవీంద్ర (75) అర్థశతకంతో రాణించడంతో.. కివీస్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇక 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలుపొందింది. ఎప్పట్లాగే మన భారత ఓపెనర్లు శుభారంభాన్నే అందించారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రోహిత్ (46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. కానీ.. 4 పరుగుల తేడాతో ఔట్ అర్థశతకం కోల్పోయాడు. ఆ వెంటనే గిల్ కూడా ఔట్ అవ్వడంతో.. జట్టు కష్టాల్లో పడినట్టయ్యింది.

అప్పుడు శ్రేయస్, కోహ్లీ కలిసి కాసేపు నిలకడగా రాణించారు. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. ఇంతలోనే శ్రేయస్ ఔట్ అవ్వడంతో, కేఎల్ రాహుల్ రంగంలోకి దిగాడు. రాహుల్, కోహ్లీ కూడా మంచి పార్ట్నర్‌షిప్ చేశారు. వీళ్లిద్దరే చివరిదాకా నిల్చుంటారని అనుకున్న తరుణంలో.. రాహుల్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. ఆ వెంటనే సూర్యకుమార్ రనౌట్‌గా వెనుకదిరిగాడు. ఆ సమయంలో వచ్చిన జడేజా, కోహ్లీ కలిసి.. చక్కగా రాణించారు. మరో వికెట్ పడనివ్వకుండా లక్ష్యం దిశగా జట్టుని నడిపించారు. కోహ్లీ సెంచరీకి దగ్గరైనప్పుడు.. జడేజా అతనికి సహకరించాడు కానీ, కోహ్లీ షాట్ కొట్టబోయి సెంచరీ మిస్ అయ్యాడు. ఆ వెలితి మినహాయిస్తే.. టీమిండియా గెలవడం మాత్రం అభిమానుల్లో ఆనందం నింపింది. ఈ విజయంతో భారత్ టేబుల్ టాపర్స్‌గా నిలిచింది.

Updated Date - 2023-10-22T22:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising