WTC Final: ఫైనల్ ప్రిపరేషన్స్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్‌లో వారికి రెస్టేనట!
ABN, First Publish Date - 2023-03-14T20:17:10+05:30
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టెస్టు డ్రా కావడం, శ్రీలంక(Sri Lanka)పై
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టెస్టు డ్రా కావడం, శ్రీలంక(Sri Lanka)పై న్యూజిలాండ్(New Zealand) విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ప్రవేశించిన టీమిండియా.. ఇప్పుడు ఫైనల్ సన్నాహాల్లో ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. ఐపీఎల్ ఫైనల్ మే 29న ముగియనుండగా జూన్ 7న ‘ద ఓవల్’లో డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్టు ప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో ఫైనల్ కోసం ఇప్పటి నుంచే భారత జట్టు(Team India) వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తాజాగా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించే భారత టెస్టు ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌లో ఆడబోరని స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు లండన్‌లో రెండు వారాల కండిషనింగ్ క్యాంపు ఉంటుందని, వారంతా దానికి హాజరవుతారని చెప్పాడు. పుజారా మాత్రం ఈసారి ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదు కాబట్టి అతడు కూడా అందుబాటులో ఉంటాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఆటగాళ్లతో తరచూ టచ్‌లో ఉంటున్నామని, వారి వర్క్‌లోడ్‌పై దృష్టిసారిస్తున్నట్టు పీటీఐ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా రోహిత్ చెప్పుకొచ్చాడు. మే 21 నాటికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి ఆరు జట్లు బయటకు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు అందుబాటులో ఉన్న ప్లేయర్లును గుర్తించి వీలైనంత త్వరగా యూకే పంపే ఏర్పాట్లు చేస్తామన్నాడు.
ఫ్రంట్‌లైన్ పేసర్లు మహమ్మద్ సిరాజ్ (RCB), మహమ్మద్ షమీ (Gujarat Titans), ఉమేశ్ యాదవ్ (KKR) తమ ఫ్రాంచైజీలకు ఫస్ట్ టీమ్ రెగ్యులర్‌గా ఉంటారని, 14 గ్రూప్ లీగ్ మ్యాచుల్లో వారు కనీసం 12 మ్యాచ్‌లు ఆడతారని అన్నాడు. వారి పనిభారాన్ని పర్యవేక్షించడం ఎంతో ముఖ్యమని రోహిత్ వివరించాడు. ఇంగ్లండ్ టెస్టుల్లో డ్యూక్ బాల్‌ను ఉపయోగించడంతో ప్రాక్టీస్ కోసం ఫాస్ట్ బౌలర్లకు డ్యూక్ (రెడ్) బాల్స్ పంపిస్తున్నట్టు చెప్పాడు. ఫైనల్‌కు ముందు సన్నాహకం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లో తాము, ఆస్ట్రేలియా జట్టు ఎన్నో మ్యాచ్‌లు ఆడినప్పటికీ తటస్థ వేదిక ఎప్పుడూ విభిన్నంగా ఉంటుందని రోహిత్ వివరించాడు.
Updated Date - 2023-03-14T21:07:30+05:30 IST