ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: చతికిలపడిన ఢిల్లీకి ఊపిరులూదిన అక్షర్.. అయినా చివర్లో ఢమాల్!

ABN, First Publish Date - 2023-04-11T21:40:23+05:30

తొలుత పటిష్ఠంగానే కనిపించి ఆపై వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ కేపిటల్స్‌ (Delhi

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: తొలుత పటిష్ఠంగానే కనిపించి ఆపై వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ కేపిటల్స్‌ (Delhi Capitals)కు అక్షర్ పటేల్ (Axar Patel) ఊపిరులూదాడు. ముంబై (MI) బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో పరుగులు వచ్చిపడ్డాయి. అప్పటి వరకు పరుగుల వాన కురిసిన స్టేడియంలో అక్షర్ అవుటయ్యాక వికెట్ల వాన మొదలైంది. జాసన్ బెహరాండార్ఫ్ వేసిన 19వ ఓవర్లో నాలుగు వికెట్లు చేజార్చుకున్న ఢిల్లీ ఒక్కసారిగా కుదేలైంది. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 172 పరుగులకు ఆలౌట్ ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు కాపాడుకోగలిగే లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి శుభారంభమే దక్కింది. ఓపెనర్ పృథ్వీషా (15) మరోమారు ఉసూరు మనిపిస్తూ 33 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే తనదైన శైలిలో ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. రెండో వికెట్‌కు వార్నర్‌తో కలిసి 43 పరుగులు జోడించి అవుటయ్యాడు. 18 బంతులు ఆడిన పాండే 5 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే యశ్ ధుల్ (2), రోవ్‌మన్ పావెల్ (4), లలిత్ యాదవ్ (2) వికెట్లను చేజార్చుకోవడంతో కష్టాల్లో పడింది.

98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోవడంతో ఇక ఢిల్లీ పని అయిపోయిందని భావించారు. అయితే, క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ ఆట స్వరూపాన్ని మార్చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి స్కోరును పరుగులు పెట్టించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన అక్షర్‌ను బెహరెండార్ఫ్ పెవిలియన్ చేర్చాడు. అది మొదలు మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51) కూడా ఆ వెంటనే అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి. 12 బంతుల్లో 15 పరుగులు చేసి 4 వికెట్లు చేజార్చుకుంది.

19 ఓవర్ తొలి బంతికి జోరుమీదున్న అక్షర్ పటేల్‌ను అవుట్ చేసిన బెహరెండార్ఫ్ మూడో బంతికి వార్నర్‌ను అవుట్ చేశాడు. నాలుగో బంతికి కుల్దీప్ యాదవ్(0) రనౌట్ అయ్యాడు. ఆరో బంతికి అభిషేక్ పోరెల్ (1) అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్‌ వేసిన మెరెడిత్ నాలుగో బంతికి నోకియా (5)ను వెనక్కి పంపడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్లలో బెహరెండార్ఫ్ , చావ్లా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-11T21:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising