ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: చెన్నైతో ఆరంభ మ్యాచ్.. ఫీల్డింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచిన పాండ్యా!

ABN, First Publish Date - 2023-03-31T19:26:19+05:30

అరిజిత్ సింగ్ గానంలో ఓలలాడి, తారలు తమన్నా భాటియా(Tamannaah Bhatia), రష్మిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: అరిజిత్ సింగ్ గానంలో ఓలలాడి, తారలు తమన్నా భాటియా(Tamannaah Bhatia), రష్మిక మందన్న(Rashmika Mandanna) డ్యాన్సులతో తడిసి ముద్దయిన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్డేడియం(Narendra Modi Stadium) తొలి ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రంతోనే జట్టుకు కప్పును అందించిన హార్దిక్ పాండ్యా ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు.

మరోవైపు, గత సీజన్‌లో దారుణ పరాభవం ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి జూలు విదల్చాలని, లక్ష్యం దిశగా సాగాలని నిర్ణయించుకుంది. నరేంద్రమోదీ స్టేడియంలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు జరగ్గా ఆరు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. రిపోర్ట్ ఇలా ఉంటే పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ వేదికపై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 160 మాత్రమే. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 166 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఇదే ఎక్కువ. మరి నేటి మ్యాచ్‌లో ఎంత టార్గెట్ నమోదువుతుందో? చూడాలి.

Updated Date - 2023-03-31T19:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising