ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. మళ్లీ ‘టాప్’లోకి వస్తుందా?

ABN, First Publish Date - 2023-04-27T19:23:59+05:30

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌కు వేదిక అయిన సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంతో చెన్నై స్కిప్పర్ ధోనీ(MS Dhoni)కి ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనీ ఇక్కడే తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక, వరుస పరాజయాలు చవిచూసిన రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది.

చెన్నై మాత్రం మూడు వరుస విజయాలతో దూకుడుమీదుంది. రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, అజింక్య రహానే, శివం దూబే వంటి వారితో టాపార్డర్ పటిష్ఠంగా ఉంది. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

రాజస్థాన్ కూడా ఏడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనుక మెరుగైన రన్‌రేట్ కారణంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఈ సీజన్‌లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాగా, గాయం కారణంగా బౌల్ట్ జట్టుకు దూరం కాగా, ఆడం జంపా తుది జట్టులోకి వచ్చాడు. చెన్నై జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

Updated Date - 2023-04-27T21:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising