IPL 2024 Auction: నేను చాలా విన్నాను.. సన్‌రైజర్స్‌లో చేరడంపై ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే..?
ABN, Publish Date - Dec 20 , 2023 | 12:13 PM
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.
దుబాయ్: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కూడా గెలిచింది. ఇక అక్టోబర్-నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను కూడా కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ప్రపంచకప్ టోర్నీని వరుసగా రెండు ఓటములతో ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ట్రోఫీ గెలిచింది. ఆసీస్ విజయంలో కెప్టెన్ కమిన్స్ కీలకపాత్ర పోషించాడు. వీటికి తోడు దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కమిన్స్‌పై కోట్ల వర్షం కురిసింది. ఏకంగా రూ.20.5 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక ధర కావడం గమనార్హం. నిజానికి కమిన్స్‌కు ఐపీఎల్ వేలంలో గతంలో కూడా రెండు సార్లు భారీ ధర దక్కింది. కానీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అయినప్పటికీ మూడో సారి గతానికి మించిన ధర దక్కడం విశేషం.
అయితే ఐపీఎల్‌లో తనను భారీ ధర వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడం పట్ల ప్యాట్ కమిన్స్ తొలిసారి స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కమిన్స్‌కు స్వాగం పలుకుతూ ఈ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కమిన్స్ మాట్లాడుతూ సన్‌రైజర్స్ జట్టులో చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమన్న కమిన్స్ త్వరలో జట్టులో చేరేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ‘‘రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరబోతున్నాను. ఆరెంజ్ ఆర్మీ గురించి నేను చాలా విన్నాను. హైదరాబాద్‌లో కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాను.హైదరాబాద్ జట్టులో చేరడానికి వేచి ఉండలేకపోతున్నాను. మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా హైదరాబాద్‌లో ఉండడం ఆనందంగా ఉంది. మేము ఈ సీజన్‌లో చాలా సరదాగా ఉండబోతున్నామని నేను భావిస్తున్నాను. మంచి విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నాను.’’ అని కమిన్స్ అన్నాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లాడిన కమిన్స్ 45 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ పలుమాలర్లు మెరుపులు మెరిపించిన కమిన్స్ 18 సగటుతో 379 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలుండగా అత్యధిక స్కోర్ 66గా ఉంది. స్ట్రైక్‌రేట్ ఏకంగా 152గా ఉంది.
Updated Date - Dec 20 , 2023 | 12:13 PM