ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jasprit Bumrah: భార్యతో కలిసి ‘ఫిఫా’ ఆడిన టీమిండియా పేసర్.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-08-30T15:23:54+05:30

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన భార్య సంజనా గణేష్‌తో కలిసి ఫిఫా వీడియో గేమ్‌ను ఆడుతూ సరదాగా గడుపుతున్న క్షణాలను జస్‌ప్రీత్ బుమ్రా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు.

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీ కోసం సన్నద్ధం అవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం ఇటీవల ఐర్లాండ్‌లో పర్యటించిన టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకోవడంలో కెప్టెన్‌గా, ఆటగాడిగా తన మార్క్ చూపించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆసియా కప్‌లోనూ రాణించి టీమిండియా టైటిల్ విజేతగా నిలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు. అయితే తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు ఒక లక్ష 98 వేల లైకులు వచ్చాయి. ఇందులో బుమ్రా, అతడి భార్య చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ODI World Cup: ఈ ఐదు సెంటిమెంట్లు చాలు.. ఇండియాదే వన్డే ప్రపంచకప్

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల తన భార్య సంజనా గణేష్‌తో కలిసి ఫిఫా వీడియో గేమ్‌ను ఆడుతూ సరదాగా గడుపుతున్న క్షణాలను జస్‌ప్రీత్ బుమ్రా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు. ఇంట్లో ఏం తోచకపోవడంతో తన భార్యతో కలిసి ఉల్లాసంగా గడిపినట్లు బుమ్రా పేర్కొన్నాడు. ఈ వీడియోలో బుమ్రా నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. కాగా జస్‌ప్రీత్ బుమ్రా మార్చి 2021లో ప్రముఖ స్పోర్ట్స్ టీవీ యాంకర్ సంజనా గణేష్‌ను వివాహం చేసుకున్నాడు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సంజనా గణేష్ గతంలో ఐసీసీ ఈవెంట్లకు హోస్ట్‌గా పనిచేసింది. అంతేకాకుండా పలు రియాల్టీ షోలలోనూ పాల్గొంది.

Updated Date - 2023-08-30T15:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising