ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2023: ఐపీఎల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

ABN, First Publish Date - 2023-10-21T19:57:56+05:30

తాము తొలిసారిగా స్ట్రీమింగ్ చేసిన ఐపీఎల్‌ను జియో సినిమా ద్వారా 45 కోట్ల మంది వీక్షించారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది గ్లోబల్ రికార్డుగా నిలిచిందని ఆయన వివరించారు.

ఈ ఏడాది ఐపీఎల్‌ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి అందరినీ జియో సినిమా ఆశ్చర్యపరిచింది. దీంతో తొలిసారిగా స్ట్రీమింగ్ చేసిన ఐపీఎల్‌ను జియో సినిమా ద్వారా 45 కోట్ల మంది వీక్షించారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది గ్లోబల్ రికార్డుగా నిలిచిందని ఆయన వివరించారు. ఈ పరిణామం కారణంగా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై జియో సినిమా అద్భుత ప్రభావం చూపిందని అంబానీ అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎక్కువ మంది టీవీల్లో చూడలేదని, మొబైల్ వంటి డిజిటల్ డివైజుల్లోనే చూశారని పేర్కొన్నారు. అంతేకాకుండా జియో సినిమా తీసుకున్న నిర్ణయం ద్వారా భారత్‌లో క్రికెట్ వంటి కంటెంట్‌ను చూసే విధానంలో భారీ మార్పు వచ్చిందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: ODI World Cup: వైడ్ బాల్ వివాదం.. కోహ్లీదే తప్పు అంటున్న రూల్స్

అటు జియో సినిమా తీసుకొచ్చిన ఏఆర్/వీఆర్ డివైజ్ కారణంగా ఇంట్లోనే 360 డిగ్రీల కోణంలో మ్యాచ్‌ను చూసే అనుభూతి దక్కిందని ముఖేష్ అంబానీ వివరించారు. ఐపీఎల్ సక్సెస్‌తో జియో సినిమా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా భారీగా పెరిగాయని చెప్పారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదో సారి ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ చాలా రికార్డులు బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌ను 120 కోట్ల మంది చూసినట్లు నివేదికలు వెల్లడించాయి. సగటున 60 నిమిషాలపాటు ఈ మ్యాచ్ చూసినట్లు గణాంకాలు వివరించాయి.

Updated Date - 2023-10-21T19:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising