Heated Exchange: 2012లో ఇషాంత్‌తో గొడవ.. అప్పుడేం జరిగిందో చెప్పిన పాక్ మాజీ క్రికెటర్
ABN, First Publish Date - 2023-02-26T16:41:51+05:30
టీమిండియా(Team India) క్రికెటర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma)తో 2012లో మైదానంలో జరిగిన
న్యూఢిల్లీ: టీమిండియా(Team India) క్రికెటర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma)తో 2012లో మైదానంలో జరిగిన గొడవ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తాజాగా పెదవి విప్పాడు. ఆ ఏడాది డిసెంబరులో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అక్మల్(Akmal)-ఇషాంత్ శర్మ(Ishant Sharma) ఇద్దరూ కలబడ్డారు. ఒకరినొకరు దూషించుకున్నారు. ఆ తర్వాత ధోనీ, సురేశ్ రైనా కల్పించుకోవడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.
నాడు ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న దానిపై తాజాగా అక్మల్(Akmal) పెదవి విప్పాడు. నిజానికి ఇషాంతే తొలుత తనను దూషించాడని, దీంతో తాను కూడా వెనక్కి తగ్గకుండా విరుచుకుపడ్డానని చెప్పాడు. తమ మధ్య జరుగుతున్న గొడవ చూసి సురేశ్ రైనా, ధోనీ వచ్చారని గుర్తు చేశాడు. సురేశ్ రైనా తమ మధ్య సయోధ్య కుదిర్చాడని చెప్పాడు. ధోనీ నిజంగా చాలా మంచోడని ప్రశంసించాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్ అద్భుతంగా ఆడారని అక్మల్(Akmal) కొనియాడాడు.
Updated Date - 2023-02-26T17:19:15+05:30 IST