Team India: బ్రేకింగ్ న్యూస్.. టీమిండియా లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
ABN, First Publish Date - 2023-10-23T16:06:41+05:30
టీమిండియా మాజీ ఆటగాడు, లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (77) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు.
టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందింది. మాజీ ఆటగాడు, లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (77) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. 1946, సెప్టెంబర్ 25న అమృత్ సర్‌లో జన్మించిన ఆయన.. 1967లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశారు. అయితే 1979లో తొలి టెస్టు ఆడాడు. కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్‌గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా మారాడు. మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు. 1975, 1979 వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియాలో చోటు కూడా సంపాదించాడు. ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్.వెంకట్రాఘవన్ వంటి దిగ్గజాలతో కలిసి టీమిండియా బౌలింగ్‌ను బిషన్ సింగ్ బేడీ బలంగా తయారుచేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 370 మ్యాచ్‌లు ఆడి 1,560 వికెట్లు పడగొట్టారు.
ఇది కూడా చదవండి: SMAT 2023: సెంచరీతో చెలరేగిన తెలుగు తేజం.. బ్యాకప్‌గా జట్టులోకి వస్తాడా?
తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 22 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ తన ఆధ్వర్యంలో ఎంతోమంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు. ఇండియా తన తొలి వన్డేలో విజయం సాధించడంలో బిషన్ సింగ్ బేడీ కీలకపాత్ర పోషించాడు. 1975 ప్రపంచకప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో బేడీ 12-8-6-1 గణాంకాలతో అదిరిపోయే రీతిలో ప్రదర్శన చేశాడు. 1978-79 కాలంలో ఢిల్లీ జట్టును రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలోనూ బేడీ రాణింపు కారణమని అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటారు.
Updated Date - 2023-10-23T16:11:03+05:30 IST