ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: ఒక్క బాల్ వేసినందుకు రూ.7 లక్షలు ఇస్తారా?

ABN, Publish Date - Dec 21 , 2023 | 06:21 PM

IPL 2024: ఐపీఎల్ మినీ వేలం ముగిసి రెండు రోజులు దాటుతున్నా ఇంకా వేలంలో నమోదైన రికార్డుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయిన ప్యాట్ కమిన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఐపీఎల్ మినీ వేలం ముగిసి రెండు రోజులు దాటుతున్నా ఇంకా వేలంలో నమోదైన రికార్డుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయిన ప్యాట్ కమిన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ మొత్తం ఆడితే బాల్‌కు రూ.7 లక్షలకు పైగా సంపాదించనున్నట్లు లెక్కలు వేస్తున్నారు. అంటే ఒక్క మ్యాచ్ ఆడినందుకు స్టార్క్ రూ.1.7 కోట్లు తీసుకోనున్నాడు. ఇది విన్న క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. స్టార్క్ వేసే బంతిని నిజంగా బంగారంతో తయారు చేసినా అంత ఖరీదు ఉండదేమోనని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఓవర్సీస్ ఆటగాళ్లుకు కోట్లు కుమ్మరించడం సబబు కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఓవర్సీస్ ఆటగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని.. మెగా వేలంలో పాల్గొనకుండా మినీ వేలంలో పాల్గొంటూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. భారత ఆటగాళ్ల కంటే ఓవర్సీస్ ఆటగాళ్లపైనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆధారపడుతున్నాయని.. ఎంతమందిని కొనుగోలు చేసినా నలుగురే తుది జట్టులో ఉండాలన్న నిబంధన ఉందనే సంగతి ఫ్రాంచైజీలు గుర్తుంచుకోవాలని కొందరు సూచిస్తున్నారు. నిజంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు వేలంలోకి వస్తే రూ.40 కోట్లకు పైగా అమ్ముడుపోతారని పలువురు జోస్యం చెప్తున్నారు. కాగా స్టార్క్‌కు దాదాపుగా రూ.25 కోట్లు ఖర్చు పెట్టడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మెంటార్ గంభీర్ స్పందించాడు. కేవలం బౌలింగ్ కోసమే స్టార్క్ కోసం అంత ఖర్చుపెట్టలేదని.. భారత యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయగల సత్తా స్టార్క్‌కు ఉందని.. అతడిలోని ఈ నైపుణ్యం ఆధారంగానే తాము భారీగా ఖర్చుపెట్టామని గంభీర్ వివరించాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 06:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising