ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: షమీ ప్రదర్శనపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అతడి మాజీ భార్య హసీన్ జహాన్

ABN, First Publish Date - 2023-11-08T16:01:14+05:30

Shami Wife Hasin Jahan: వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న మహ్మద్ షమీ(Mohammad Shami) పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా ప్రత్యర్థులను అతడు తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా నాలుగు మ్యాచ్‌లలో కేవలం 7 సగటుతో 16 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి మాజీ భార్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని టీమ్ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో అతడి స్థానంలో షమీని తుదిజట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ నుంచి షమీని తీసుకోగా అతడు చెలరేగిపోతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా నాలుగు మ్యాచ్‌లలో కేవలం 7 సగటుతో 16 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో అతడి ప్రదర్శనపై క్రికెట్ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ హిందీ టీవీ ఛానల్‌లో ఓ చర్చా కార్యక్రమంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ పాల్గొంది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో షమీ రాణిస్తున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రపంచకప్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదని.. షమీ బాగా ఆడితే భారత జట్టులోనే ఉంటాడని.. అంతేకాకుండా మంచిగా సంపాదిస్తాడని హసీన్ జహాన్ అభిప్రాయపడింది. అతడు సంపాదిస్తే తమకు ఎంతో సురక్షితంగా ఉంటుందని.. దీంతో అతడు మంచిగా రాణించాలని ఆకాంక్షించింది. కొన్నేళ్ల క్రితం షమీతో అభిప్రాయభేదాల కారణంగా హసీన్ జహాన్ విడిపోయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆమెకు షమీ నెలకు రూ.1.3 లక్షల మేరకు భరణంగా చెల్లిస్తు్న్నాడు. దీంతో షమీ బాగా సంపాదించాలని హసీన్ కామెంట్ చేయడంపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. ఇంత చౌకబారుగా ఆలోచించడం ఆమెకే చెల్లిందని ఎద్దేవా చేస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-08T16:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising