ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తె రియాక్షన్ చూశారా?

ABN, First Publish Date - 2023-08-24T13:22:54+05:30

చంద్రయాన్-3 సక్సెస్‌తో మన దేశంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు కూడా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాన్ని ధోనీ కూడా కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ధోనీ కుమార్తె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చంద్రయాన్-3పై చర్చ నడుస్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని ఘనత భారత్‌కు మాత్రమే సొంతమైంది. భూమిపై చంద్రోదయం అయ్యే సమయంలో చంద్రుడిపై ఓ నవోదయాన్ని భారత్ సాధ్యం చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. దీంతో మన దేశంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అంటూ బుధవారం సాయంత్రం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు కూడా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాన్ని ధోనీ కూడా కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: మనోడు.. పట్టు వదల్లేదు

ఈ వీడియోలో ధోనీ కుమార్తె జీవా కూడా కనిపిస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్ కాగానే ఆమె రియాక్షన్ చూసిన అభిమానులు సంతోషంతో మురిసిపోతున్నారు. టీవీలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను చూసిన జీవా సంతోషంతో చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేసింది. ధోనీ కూడా చాలా కూల్‌గా కనిపించాడు. ఈ వీడియో ధోనీ ట్యాంక్ టాప్, షార్ట్ వేసుకుని ఉన్నాడు. చాలా సెటిల్డ్‌గా భారత్ విజయాన్ని తాను కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ధోనీని ఎందుకు కూల్ కెప్టెన్ అని అంటారో ఈ వీడియో ద్వారా మరోసారి చాటిచెప్పాడంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

కాగా చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఇస్రో సైంటిస్టులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ వాసులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్ కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం గమనించాల్సిన విషయం. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ఉపవాసం ఉన్న సీమా హైదర్ జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ కావడం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటి ముందు టపాసులు కాల్చుతూ జైశ్రీరామ్, వందేమాతరం అంటూ సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - 2023-08-24T13:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising