ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-09-08T13:36:41+05:30

మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతడిని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. దీంతో ట్రంప్‌ నివాసానికి వెళ్లిన ధోనీ ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. అంతేకాకుండా సరదాగా కాసేపు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ధోనీ, ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. తన కెప్టెన్సీ ప్రతిభతో ఐదోసారి ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు. ధోనీకి క్రికెట్‌తో పాటు టెన్నిస్ ఆడటం కూడా చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ తన స్నేహితులతో కలిసి హాజరయ్యాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా టెన్నిస్ మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ఆట మధ్యలో అల్కరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకుని డ్రింక్స్‌ తాగుతుండగా అతడి వెనుక వైపు ప్రేక్షకుల సీట్లలో కూర్చుని ఉన్న ధోనీ తన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతడిని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. దీంతో ట్రంప్‌ నివాసానికి వెళ్లిన ధోనీ ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. అంతేకాకుండా సరదాగా కాసేపు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ధోనీ, ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ స్నేహితుడు, వ్యాపారవేత్త హితేష్ సింఘ్వీ ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టీమిండియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ధోనీని ఎంతో అభిమానించే ట్రంప్ అతడిని కలుసుకునేందుకే ప్రత్యేకంగా గోల్ఫ్ గేమ్ ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మళ్లీ వర్షం ముప్పు.. ఆసియా కప్ ఫెయిల్యూర్‌కు బీసీసీఐనే కారణమా?

కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ కెరీర్‌లో ధోనీకి చివరి సీజన్ అని ప్రచారం సాగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలివెళ్లారు. కానీ ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే ఏడాది తన శరీరం సహకరిస్తే ఐపీఎల్ ఆడతానని.. ఇప్పుడే తన రిటైర్మెంట్ గురించి చెప్పలేనని తెలపడంతో ధోనీ మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడని అభిమానులు భావిస్తు్న్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో గాయపడినా.. మోకాలి గాయంతోనే ధోనీ మ్యాచ్‌లను ఆడాడు. అయితే సీజన్ ముగిసిన వెంటనే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది.

Updated Date - 2023-09-08T13:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising