ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shubman Gill: గిల్ దిగ్గజ క్రికెటర్ అవుతాడు: పాక్ మాజీ కెప్టెన్

ABN, First Publish Date - 2023-01-20T18:34:43+05:30

హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్‌(Shubman Gill)పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగిన గిల్ 208 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. డబుల్ సెంచరీ చేసిన గిల్ ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.

గిల్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్(Salman Butt) కూడా స్పందించాడు. తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. దిగ్గజ క్రికెటర్ల స్పర్శకు క్రికెట్ దూరమవుతున్న వేళ గిల్ లాంటి ఆటగాడి అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. గిల్ మున్ముందు కూడా ఇదే ఆటతీరును కనబరిస్తే దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరడం పక్కా అని చెప్పుకొచ్చాడు.

నిజానికి తానెప్పుడో గిల్‌కు అభిమానిగా మారిపోయానని అన్నాడు. భారత్-కివీస్ మధ్య జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌లో గిల్ ఆట చూసిన తర్వాత అతడికి తాను ఫ్యాన్ అయిపోయానన్నాడు. అతడు ఇప్పటి వరకు పెద్ద స్కోర్లు చేయకపోవడం చూసి తాను ఆందోళన చెందానని, నైపుణ్యం ఉండి కూడా భారీ స్కోర్లు ఎందుకు చేయలేకపోతున్నాడని అనిపించేదని అన్నాడు. అయితే, హైదరాబాద్ మ్యాచ్‌లో భిన్నమైన ఆటతీరుతో అదరగొట్టాడని ఈ మాజీ క్రికెటర్ ప్రశంసించాడు.

ఇంత పిన్న వయసులో ఇలా ఆడే అతి కొద్ది మంది క్రికెటర్లలో గిల్ ఒకడని కొనియాడాడు. గిల్ భవిష్యత్తులో దిగ్గజ ఆటగాళ్ల సరసన చేయడం పక్కా అని తేల్చేశాడు. హైదరాబాద్‌లో గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు. సచిన్ టెండూల్కర్, మార్క్ వా, సయీద్ అన్వర్, జాక్వెస్ కలిస్ వంటి ఆటగాళ్ల స్పర్శను క్రికెట్ కోల్పోతున్న వేళ గిల్ లాంటి వారి అవసరం క్రికెట్‌కు ఉందని సల్మాన్ భట్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-01-20T18:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising