ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: పాకిస్థాన్ కెప్టెన్ వాట్సాప్ ఛాటింగ్ లీక్.. అసలు ఏం జరిగిందంటే..?

ABN, First Publish Date - 2023-10-31T18:42:31+05:30

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌, పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ లీక్‌ అయింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌ ఓ టీవీ ఛానల్లో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్‌ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దాయాది దేశం పాకిస్థాన్ దారుణ ప్రదర్శన చేస్తోంది. టీమిండియాతో మ్యాచ్ తర్వాత ఆత్మ విశ్వాసం దెబ్బతినడంతో వరుసగా ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ వంటి జట్లతో కూడా పాకిస్థాన్ ఓటమి పాలైంది. దీంతో అభిమానులు ఆ జట్టుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజమ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే కెప్టెన్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కొన్ని రోజులుగా పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్‌ను కాంటాక్ట్ అవ్వడానికి బాబర్ ఆజమ్ ప్రయత్నిస్తున్నాడని, కానీ అష్రాఫ్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించాడు.

అయితే రషీద్ లతీఫ్ వ్యాఖ్యలపై పీసీబీ చీఫ్ స్పందించాడు. బాబర్ తనను కాంటాక్ట్ చేసే ప్రయత్నమేమీ చేయలేదన్నాడు. ఇందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తూ.. బాబర్ ఆజమ్‌కు సంబంధించిన పర్సనల్ చాట్స్ కూడా లీక్ చేశాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో రిపోర్టర్ ఈ చాట్స్‌ను బయటపెట్టాడు. బాబర్, పీసీబీ చీఫ్ మధ్య జరిగిన చాట్‌ను అందరికీ చూపించాడు. ఈ అంశంపై పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించి ఆటగాడి పర్సనల్ చాట్స్‌ను బయటపెట్టడాన్ని తప్పుబట్టాడు. ఇలా ఒక ఆటగాడి పర్సనల్ చాట్స్ అసలు ఎలా బయటపెడతారని నిలదీశాడు. ఇంతకన్నా చెత్త పని మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఒక వ్యక్తి ప్రైవేట్ చాట్స్ లీక్ చేయడం దిగజారుడుతనంతో సమానం అని పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టుకు పీసీబీ నుంచి సరైన సహకారం లేదని, గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని.. అందుకే పీసీబీ చీఫ్‌తో బాబర్ మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ప్రపంచకప్ ముగిసిన తర్వాత బాబర్ కెప్టెన్సీపై వేటు పడుతుందని పాకిస్థాన్ అభిమానులు భావిస్తున్నారు.

Updated Date - 2023-10-31T18:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising