ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Babar Azam: కెప్టెన్‌గా బాబర్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తున్న పాక్ మాజీలు.. ఆ ఆటగాడిని కెప్టెన్ చేయాలని సూచన

ABN, First Publish Date - 2023-10-25T13:01:08+05:30

దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుత వన్డే వరల్డ్ 2023లో ఘోరంగా విఫలమవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో పెద్ద రాణించలేకపోతున్నారు. ఈ ప్రభావం జట్టు గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. పాక్ ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పరిమితమైంది.

దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుత వన్డే వరల్డ్ 2023లో ఘోరంగా విఫలమవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో పెద్ద రాణించలేకపోతున్నారు. ఈ ప్రభావం జట్టు గెలుపు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. పాక్ ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పరిమితమైంది. ఈ ఆటతీరు చూస్తుంటే వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ముఖ్యంగా సోమవారం బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాక పాక్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిపోయి పరువు పోగొట్టారంటూ ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మాజీల వరకు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


ఇదివరకెప్పుడూ ఎరుగని స్థాయిలో బాబర్ ఆజమ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాలంటూ పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్, ఆ దేశ మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క కెప్టెన్ బాబర్‌ను మాత్రమే కాకుండా చెత్త ప్రదర్శన చేసిన మరికొందరు ఆటగాళ్లను కూడా జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వసీం అక్రమ్, మిస్బావుల్ హాక్, రమీజ్ రాజా, రషీద్ లతీఫ్, మహ్మద్ హఫీజ్, ఆకీబ్ జావేద్, షోయబ్ మాలి్, మొయిన్ ఖాన్, షోయబ్ అక్తర్ వంటి మాజీలంతా జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ ఓటమి తర్వాత పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ భేటీ అయ్యి చర్చించారు.

కాగా బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి పేసర్ షాహీన్ షా అఫ్రీదికి బాధ్యతలు అప్పగించాలని పాక్ మాజీ ఆకీబ్ జావేద్ అన్నాడు. వన్డేలకు అఫ్రీదికి పగ్గాలు అప్పగించాలని పేర్కొన్నాడు. అంతేకాదు ఆప్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో ఆటగాళ్లందరిపైనా మండిపడ్డాడు. వాళ్లందరినీ జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.

Updated Date - 2023-10-25T13:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising