ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pakistan vs Sri Lanka: శతక్కొట్టిగా ఆ ఇద్దరు ఆటగాళ్లు.. శ్రీలంకపై పాకిస్తాన్ ఘనవిజయం

ABN, First Publish Date - 2023-10-10T23:09:43+05:30

వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో..

వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ సాధించింది. అబ్దుల్లా షఫీక్ (113), మహమ్మద్ రిజ్వాన్ (131) శతకాలతో రాణించడం వల్లే పాక్ ఈ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది. ముఖ్యంగా రిజ్వాన్ నాలుగో స్థానంలో దిగి, చివరివరకూ క్రీజులో నిల్చొని, తన జట్టుని గెలిపించి హీరోగా నిలిచాడు.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుసల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) శతకాలతో రప్ఫాడించడం.. నిస్సాంక (51) అర్థశకతంతో నెట్టుకురావడంతో.. శ్రీలంక జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. నిజానికి.. ఈ ముగ్గురు ఆటగాళ్ల దూకుడు చూసి శ్రీలంక జట్టు 370-380 పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ.. ఆ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు అంతగా సత్తా చాటకపోవడం వల్ల 344 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.

మొదట్లో ఇమామ్ (12), బాబర్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో.. పాక్ జట్టు కష్టాల్లో పడినట్టయ్యింది. అప్పుడు అబ్దుల్లా, రిజ్వాన్ అడ్డగోడలాగా నిలబడిపోయి.. తమ జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్‌కి 176 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆచితూచి ఆడుతూనే.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీల మోత మోగించారు. అబ్దుల్లా ఔటయ్యాక రిజ్వాన్ వెన్నెముకలా నిల్చాడు. చివరివరకు క్రీజులోనే ఉండి.. షకీల్ (31), ఇఫ్తికార్‌ (22)ల సహకారంతో జట్టుని గెలిపించాడు. ఇరుజట్లు అద్భుత పెర్ఫార్మెన్స్ కనబర్చడంతో.. మైదానంలోని ఆడియెన్స్ ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్ చేశారు.

Updated Date - 2023-10-11T10:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising