ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rishab Pant: ఒక్క పోస్టుతో అభిమానుల్లో జోష్ పెంచిన పంత్

ABN, First Publish Date - 2023-07-05T20:05:36+05:30

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని జిమ్‌లో పంత్ వర్కవుట్లు చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ‘లెజెండరీగా ఉండండి’ అనే కొటేషన్ ఉంది. అంతేకాకుండా ‘ధన్యవాదాలు చెప్పే మనసే అతి గొప్పది. అలాంటిదే ఉండాలి’ అంటూ ఓ క్యాప్షన్ తగిలించాడు. దీంతో నువ్వు ఒక లెజెండ్ అని పంత్‌ను ఉద్దేశిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవల చేతికర్ర, ఇతరుల సాయం లేకుండా మెట్లు ఎక్కిన ఫోటోలను పంత్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని జిమ్‌లో పంత్ వర్కవుట్లు చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ‘లెజెండరీగా ఉండండి’ అనే కొటేషన్ ఉంది. అంతేకాకుండా ‘ధన్యవాదాలు చెప్పే మనసే అతి గొప్పది. అలాంటిదే ఉండాలి’ అంటూ ఓ క్యాప్షన్ తగిలించాడు. దీంతో నువ్వు ఒక లెజెండ్ అని పంత్‌ను ఉద్దేశిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. పంత్ త్వరగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాలని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొని అదిరిపోయేలా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టీమిండియాలో నాలుగో స్థానం ఎవరిది?

కాగా కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన రిషబ్ పంత్ అక్కడ రిహాబిలేషన్‌లో ఉన్నాడు. ఆపరేషన్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అతడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అభిమానులతో అనేక ముచ్చట్లను షేర్ చేసుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఇప్పటివరకు బ్యాట్ పట్టుకోలేదు. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కూడా పంత్ ఆడలేకపోయాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లోగా పంత్ కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి పంత్ ఒక్క పోస్టుతో అభిమానుల్లో జోష్ నింపాడనే చెప్పాలి.

Updated Date - 2023-07-05T20:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising