SA Vs NZ: డికాక్ వీరవిహారం.. ఈ మెగా టోర్నీలో నాలుగో సెంచరీ
ABN, First Publish Date - 2023-11-01T17:02:23+05:30
వన్డే ప్రపంచకప్‌లో పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ మరో సెంచరీ చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఓపెనర్ క్వింటన్ డికాక్ వీరవిహారం చేస్తున్నాడు. టీమ్ ఎలాంటిదైనా సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డికాక్ మరో సెంచరీ చేశాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు. అయితే ప్రస్తుత టోర్నీలో ఏడు మ్యాచ్‌లలోనే డికాక్ నాలుగు సెంచరీలు చేశాడు. ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు ఉండటంతో డికాక్ మరో సెంచరీ చేస్తే రోహిత్ రికార్డును కూడా అధిగమించేలా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: ODI World Cup: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్‌పై నిషేధం
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో డికాక్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. 50 పరుగులు దాటితే చాలు ఆ స్కోరును సెంచరీగా మార్చేస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంకపై 84 బాల్స్‌లో 100 పరుగులు చేసిన డికాక్.. ఆస్ట్రేలియాపై 106 బాల్స్‌లో 109 రన్స్ సాధించాడు. బంగ్లాదేశ్‌పై 140 బాల్స్‌లో 174 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌పై 116 బాల్స్‌లో 114 పరుగులు చేశాడు. మరోవైపు ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ చరిత్రలో డికాక్ 24 మ్యాచ్‌లు ఆడగా మొత్తం నాలుగు సెంచరీలు చేశాడు. ఇవన్నీ ప్రస్తుత ప్రపంచకప్‌లోనే చేయడం గమనించాల్సిన విషయం. ఈ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తానని.. తనకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అని డికాక్ గతంలోనే ప్రకటించాడు. అటు టీమిండియా గడ్డపై డికాక్‌కు వన్డేల్లో ఇది ఆరో సెంచరీ. భారత గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్ ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Updated Date - 2023-11-01T17:06:41+05:30 IST