ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం.. నిరాశలో ఫ్యాన్స్

ABN, Publish Date - Dec 25 , 2023 | 02:48 PM

SA Vs IND: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను ఆడేసింది. మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా జరగనుంది. అయితే ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను ఆడేసింది. మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా జరగనుంది. అయితే ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆది, సోమ వారాలలో సెంచూరియన్‌లో భారీ వర్షం కురిసింది. తొలి టెస్టు ప్రారంభమయ్యే మంగళవారం రోజు కూడా 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా సెంచూరియన్‌లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయినట్లు సమాచారం అందుతోంది.

కాగా టీమిండియా చాలా కాలం తర్వాత టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఒకవేళ సిరీస్ గెలిస్తే సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సాధించనున్నాడు. అటు గతంలో దక్షిణాఫ్రికాపైనే రోహిత్ ఓపెనర్‌గా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తన కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో రోహిత్ ఎన్నో అంచనాలతో టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో జట్టును విజయపథం నడిపి ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. కానీ ఫైనల్లో ఓడిపోవడంతో అతడితో పాటు అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన నుంచి బయటపడాలంటే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ అటు ఆటగాడిగా.. ఇటు సారథిగా రాణించాల్సి ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు సెంచూరియన్‌లో, రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి జరుగుతాయి.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 02:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising