ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jio Cinema: ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా లేనంతగా.. జియో సినిమా రికార్డు నిజమేనా?

ABN, First Publish Date - 2023-11-27T15:02:22+05:30

టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్‌తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్‌తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎంతో ఆసక్తి రేపిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను 5.3 కోట్ల మందే వీక్షించారు. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో జియో సినిమాను 15 కోట్ల మంది వీక్షించారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. జియో సినిమా ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో రికార్డులు బద్దలు కొట్టిందని అందరూ భావిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హాట్ స్టార్‌లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వ్యూయర్స్ చూడగా.. ఇప్పుడు జియో సినిమా మాత్రం 15 కోట్ల వ్యూస్ అని మాత్రమే ప్రస్తావించింది. అంటే వ్యూయర్ షిప్ వేరు.. వ్యూస్ వేరు. అనుకోకుండా జరిగిందో లేదా మార్కెటింగ్ స్ట్రాటజీనో తెలియదు కానీ జియో సినిమా యాజమాన్యం 15 కోట్ల వ్యూస్ అని ప్రస్తావించేసరికి అందరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రపంచకప్‌కు కూడా సాధ్యం కాని రీతిలో ఓ టీ20 సిరీస్‌కు ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అసలు విషయం తెలిసి తస్సాదియ్యా అని జియో సినిమా మాస్టర్ మైండ్‌ను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లో హాట్ స్టార్ రికార్డును బద్దలు కొట్టేది జియో సినిమానే అయినా.. వారం రోజుల్లోనే ఇంత భారీ తేడాతో వ్యూయర్ షిప్ దక్కుతుందని భావించడం అతిశయోక్తి మాత్రమే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ ఓడిన బాధను ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారీ స్కోర్లు చేస్తూ విజయాల బాట పట్టడం అభిమానుల్లో కొంత సంతోషాన్ని నింపుతోందని తెలుస్తోంది. టీమిండియా కుర్రాళ్లు ఇలాగే చెలరేగి ఆడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T15:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising