ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Year Ender 2023: ఈ ఏడాది టీమిండియాలో రైజింగ్ స్టార్లు వీళ్లే..!!

ABN, Publish Date - Dec 22 , 2023 | 08:30 PM

కొంతమంది వర్ధమాన క్రికెటర్లు ఈ ఏడాది తమ సత్తా నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్, యషస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ ఈ జాబితాలో ఉన్నారు.

2023 ఏడాది ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది క్రికెట్‌కు సంబంధించి టీమిండియాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐసీసీ టోర్నీలలో విజేతగా నిలవకపోయినా టీమిండియా మంచి ప్రదర్శనే చేసింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ వంటి టోర్నీల్లో ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఆసియా కప్ కైవసం చేసుకుంది. కానీ ఐసీసీ ర్యాంకులలో మాత్రం మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియానే ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది వర్ధమాన క్రికెటర్లు ఈ ఏడాది తమ సత్తా నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారు.

1) శుభ్‌మన్ గిల్

24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన గిల్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రాణించాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 2వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 2023లో 29 వన్డేలు ఆడిన గిల్ 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1,584 పరుగులు సాధించాడు. దీంతో ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అటు 17 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 59.33 సగటు, 157.8 స్ట్రయిక్ రేట్‌తో 890 పరుగులు చేశాడు.

2) యషస్వీ జైశ్వాల్

21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ యషస్వీ జైశ్వాల్ కూడా ఈ ఏడాది మంచి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ ద్వారానే తన సత్తా నిరూపించుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 14 ఐపీఎల్ మ్యాచ్‌లలో 48 సగటు, 163 స్ట్రయిక్ రేట్‌తో 625 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. దీంతో అతడు టీమిండియాలో చోటు సంపాదించాడు. టీ20లలో దూకుడుగా ఆడుతూ ఆరంభాలను ఇస్తున్నాడు.

3) తిలక్ వర్మ

21 ఏళ్ల మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా ఐపీఎల్‌తోనే సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు సంపాదించాడు. ముంబై ఇండియన్స్ తరఫున 42 సగటు, 164 స్ట్రయిక్ రేట్‌తో నిలకడగా ఆడిన తిలక్ వర్మ టీమిండియాలో చోటు సంపాదించాడు. కీలకమైన సమయాల్లో ఒత్తిడిని తట్టుకుంటూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు.

4) రింకూ సింగ్

26 ఏళ్ల రింకూ సింగ్ కూడా ఐపీఎల్‌తోనే తనలోని టాలెంట్ బయటపెట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి అదరహో అనిపించాడు. దీంతో సెలక్టర్ల దృష్టిలో పడి టీమిండియాలో చోటు సంపాదించాడు. స్లాగ్ ఓవర్లలో సిక్సర్లు కొట్టే సామర్థ్యం, మ్యాచ్‌ను ఫినిష్ చేసే సత్తా రింకూ సింగ్‌లో ఉన్నాయి.

5) తుషార్ దేశ్ పాండే

28 ఏళ్ల బౌలర్ తుషార్ దేశ్ పాండే కూడా ఐపీఎల్‌తోనే వెలుగులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీలక బౌలర్‌గా మారి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. కొత్త బాల్‌తో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం తుషార్ దేశ్ పాండేను స్టార్‌గా మార్చాయి.

6) ముఖేష్ కుమార్

25 ఏళ్ల లెఫ్టార్మ్ సీమర్ ముఖేష్ కుమార్ దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణించాడు. స్వింగ్ బౌలింగ్‌తో వికెట్లు సాధించడం ముఖేష్‌ను ప్రత్యేక బౌలర్‌గా నిలిపాయి. దీంతో టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు.

7) జితేష్ శర్మ

27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా ఐపీఎల్ ద్వారా తన సత్తా నిరూపించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన జితేష్ శర్మ ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. పిచ్ ఎలాంటిదైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. బాల్‌ను హిట్టింగ్ చేయడం జితేష్ శర్మ స్పెషల్ అని చెప్పవచ్చు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 22 , 2023 | 08:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising