Rohit Sharma: సంచలనం సృష్టించిన రోహిత్ శర్మ.. ఏబీ డీ విలియర్స్ రికార్డ్ బద్దలు.. అగ్రస్థానం కైవసం
ABN, First Publish Date - 2023-11-12T16:38:01+05:30
Rohit Sharma: వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు కానీ, నిలకడ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. కానీ.. వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి అతడు విశ్వరూపం చూపిస్తున్నాడు.
వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు కానీ, నిలకడ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. కానీ.. వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి అతడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే.. ఎడాపెడా షాట్లతో విరుచుకుపడుతున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించని మైదానాల్లోనూ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. రికార్డ్-బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్‌గా రోహిత్ చరిత్రపుటలకెక్కాడు. లీగ్ దశలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.
ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పట్లాగే ఈసారి కూడా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి జట్టుకి శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా.. రోహిత్ శర్మ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. 54 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అతడు బాదిన రెండు సిక్సుల కారణంగా.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సుల బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి.. ఏబీ డీ విలియర్స్ (58) రికార్డ్‌ని రోహిత్ సమం చేశాడు. లేటెస్ట్‌గా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు సిక్సులు కొట్టి.. డీ విలియర్స్ రికార్డ్‌ని రోహిత్ శర్మ (60) పటాపంచలు చేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్లు
1. రోహిత్ శర్మ - 60 (24 ఇన్నింగ్స్ - 2023)
2. ఏబీ డీ విలియర్స్ - 58 (18 ఇన్నింగ్స్ - 2015)
3. క్రిస్ గేల్ - 56 (15 ఇన్నింగ్స్ - 2019)
4. షాహిద్ ఆఫ్రిది : 48 (36 ఇన్నింగ్స్- 2002)
Updated Date - 2023-11-12T16:38:03+05:30 IST