ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rohit Sharma: రోహిత్‌పై వేలాడుతున్న కత్తి.. టెస్ట్ పాసవుతాడా?

ABN, First Publish Date - 2023-07-11T15:22:18+05:30

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ నిజంగా రోహిత్ శర్మకు టెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో రోహిత్ కెప్టెన్సీపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ టీమిండియాకు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందించలేకపోయాడు. దీంతో రోహిత్ సామర్థ్యంపై విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ ఓడిపోవడంతో ఈ విమర్శల జోరు పెరిగింది. దీంతో ఇప్పుడు అందరి చూపు రోహిత్ మీదే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుధవారం నుంచి టీమిండియా (Team India) వెస్టిండీస్ (West Indies) పర్యటన షురూ కానుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు ముందుగా రెండు టెస్టులను ఆడనుంది. ఇటీవల ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (ICC Test Championship) ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా తలపడనున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే. ఐపీఎల్ (IPL 2023) ముగిసిన వారం రోజులకే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడి ఓడిపోవడంతో ఆ నెపం ఐపీఎల్‌పై తోసేశారు. అయితే ఇప్పుడు ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. మరి వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ టెస్ట్ సిరీస్ నిజంగా రోహిత్ శర్మకు టెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉండటంతో రోహిత్ కెప్టెన్సీపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ టీమిండియాకు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందించలేకపోయాడు. దీంతో రోహిత్ సామర్థ్యంపై విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ ఓడిపోవడంతో ఈ విమర్శల జోరు పెరిగింది. దీంతో ఇప్పుడు అందరి చూపు రోహిత్ మీదే ఉంది. మరోవైపు ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడంతో వెస్టిండీస్ ఆటగాళ్లు కసితో కనిపిస్తున్నారు. టీమిండియాపై గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ గడ్డపై రోహిత్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరోవైపు రోహిత్ కెప్టెన్సీ తనను నిరాశ పరుస్తోందని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. వందల మ్యాచ్‌లు అనుభవం ఉన్న రోహిత్ సరిగ్గా రాణించడం లేదని.. విదేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయడమే అతడి ముందు ఉన్న పెద్ద లక్ష్యం అని అభిప్రాయపడ్డాడు. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా టీ20 ఫార్మాట్‌లో కనీసం జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లలేకపోయాడని గవాస్కర్ విమర్శించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత సన్నాహకం సరిగ్గా లేదని చెప్పడం అవివేకమని.. ఇప్పుడు వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఎన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిందో చెప్పాలని నిలదీశాడు. సన్నాహకం గురించి మాట్లాడేటప్పుడు రోహిత్ వ్యాఖ్యల్లో నిజాయితీ ఉండాలని గవాస్కర్ హితవు పలికాడు.

ఇది కూడా చదవండి: మరో 3 వికెట్లు తీస్తే అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు.. మూడో భారత ఆటగాడిగా..

అటు టెస్టుల్లో రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించి మరోసారి విరాట్ కోహ్లీకి నాయకత్వం అప్పగించాలని మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించాడు. రహానె మళ్లీ జట్టులోకి వచ్చి వైస్ కెప్టెన్ అయ్యాడని.. అలాంటప్పుడు కోహ్లీకి మరోసారి కెప్టెన్సీ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించాడు. రోహిత్‌ను కాదనుకుంటే సెలక్టర్లు కచ్చితంగా కోహ్లీ వైపు మొగ్గు చూపాలని కోరాడు. ఈ నేపథ్యంలో రోహిత్ వ్యక్తిగతంగా రాణించడంతో పాటు కెప్టెన్‌గా ఆకట్టుకోకుంటే విమర్శల వేడి పెరిగే అవకాశం ఉంది. కెప్టెన్సీతో పాటు రోహిత్ చోటు కూడా జట్టులో గల్లంతు అయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా చూస్తే రోహిత్‌పై కత్తి వేలాడుతుందనే చెప్పాలి. మరి అతడు ఈ టెస్ట్ పాసవుతాడా.. ఫెయిలవుతాడో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-07-11T15:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising