ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: సంజు శాంసన్‌పై ఎందుకింత కక్ష? రిటైర్ అవ్వాలని అభిమానుల సూచన

ABN, First Publish Date - 2023-11-21T14:53:06+05:30

India Vs Australia T20 Series: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించగా.. ఈ జట్టులో సంజు శాంసన్ పేరు లేకపోవడంతో కొందరు అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజుపై ఎందుకింత కక్ష అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు సరే.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ పెద్దలను నిలదీస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే సీనియర్లకు విశ్రాంతి ఇవ్వగా జూనియర్ క్రికెటర్లకు ఈ సిరీస్ కోసం అవకాశం ఇచ్చింది. దీంతో యషస్వీ జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబె, రింకూ సింగ్ వంటి క్రికెటర్లకు స్థానం లభించింది. ఈ జట్టులో సంజు శాంసన్ లేకపోవడంతో కొందరు అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజుపై ఎందుకింత కక్ష అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు సరే.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ పెద్దలను నిలదీస్తున్నారు.

చాలా కాలం నుంచి రెగ్యులర్ స్థానం కోసం సంజు శాంసన్ ఎదురుచూస్తున్నాడని.. కానీ వికెట్ కీపర్ బ్యాటర్లకు పోటీ తీవ్రంగా ఉండటం వల్ల సంజు కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాడని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతీసారి శాంసన్ రాణిస్తున్నాడని.. 80 శాతం సక్సెస్ అయ్యాడని గుర్తుచేస్తున్నారు. అయినా సెలక్టర్లు మొండిచేయి చూపడం సరికాదని అంటున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా సెలక్టర్లు సంజూకు అన్యాయం చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు ఆసియా కప్‌, ఆసియా క్రీడలకు కూడా సంజును ఎంపిక చేయలేదని.. అసలు బీసీసీఐ వైఖరి ఏంటో తమకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐలో రాజకీయాల కారణంగా అంబటి రాయుడు తరహాలో సంజూకు కూడా సెలక్టర్లు అన్యాయం చేస్తూనే ఉన్నారని.. ఇవన్నీ భరించేకంటే అతడు రిటైర్ అయిపోవడం మంచిదని సూచిస్తున్నారు. నెదర్లాండ్స్, ఐర్లాండ్ లాంటి ఇతర జట్లకు తరలిపోవాలని.. అక్కడైనా శాంసన్‌కు న్యాయం జరుగుతుందని అభిమానులు సలహా ఇస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-21T14:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising