ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌కు ముద్దు పెట్టిన సచిన్ కుమార్తె.. అసలు ట్విస్ట్ ఇదే..!!

ABN, First Publish Date - 2023-11-09T15:08:54+05:30

Sara Tendulkar: టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో సారా టెండూల్కర్ దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. అయితే తాజాగా సారా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Sara Tendulkar: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకుల్లో కూడా గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి మరీ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 830 రేటింగ్ పాయింట్లు ఉండగా.. బాబర్ ఆజమ్ ఖాతాలో 824 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అయితే ఐసీసీ ర్యాంకుల్లో గిల్ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాకుండా గిల్‌కు ఎంతో ఇష్టమైన తన ప్రేయసి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఆమె ఎవరో కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్. ఇప్పటికే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో ఆమె దర్శనమిస్తోంది. స్టేడియానికి వచ్చి టీమిండియా ఆటగాళ్లకు ముఖ్యంగా గిల్‌కు తన మద్దతు తెలుపుతోంది. ఇప్పుడు గిల్ నంబర్‌వన్ కావడంతో ఆమె స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

సారా టెండూల్కర్ సోషల్ మీడియా X (ట్విట్టర్)లో వరల్డ్ నంబర్‌వన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అని రాసి.. ఆ పేరు పక్కన లవ్ సింబల్‌తో పాటు ముద్దు పెడుతున్న ఎమోజీని షేర్ చేసింది. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ ట్విట్టర్ హ్యాండిల్ సారా టెండూల్కర్‌ది కాదని.. ఆమె సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే వాడుతుందని.. ట్విట్టర్‌కు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో సారా టెండూల్కర్ పేరుపై నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన పోస్ట్ కూడా నకిలీ ఖాతాలోదే అని ప్రచారం జరుగుతోంది. ఈ ఖాతాకు 74వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొన్నిరోజులుగా గిల్-సారా మధ్య ప్రేమాయణం నడుస్తోందని .. ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని.. నకిలీ ఖాతాల ద్వారా వాళ్ల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని నెటిజన్‌లు భావిస్తున్నారు. ఇటీవల సారా ఎక్కడ కనిపించినా గిల్ నామస్మరణ చేస్తుండటం కూడా కొందరికి చికాకు కలిగిస్తోంది. మరి నిజంగానే గిల్-సారా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-09T15:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising