ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: సీక్రెట్ రివీల్ చేసిన హార్దిక్ పాండ్యా.. మంత్రం గురించి ఏం చెప్పాడంటే..?

ABN, First Publish Date - 2023-10-16T21:03:48+05:30

పాకిస్థాన్ మ్యాచ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఓపెనర్ ఇమాముల్ హక్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అతడు ఏదో మంత్రం చదివి ఇమాముల్ హక్‌ను అవుట్ చేశాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు పాకిస్థాన్‌ను బెంబేలెత్తించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం హార్దిక్ పాండ్యా మంత్రం. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అతడు ఏదో మంత్రం చదివి ఇమాముల్ హక్‌ను అవుట్ చేశాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు. సరిగ్గా బంతి వేసే ముందు పాండ్యా.. ఆ బాల్‌ను రెండు చేతులతో నోటికి దగ్గరగా పెట్టుకుని ఏదో చదివాడు. ఆ వెంటనే వికెట్ దొరకడంతో పాండ్యా బంతిపై ఏదో మంత్రం వేశాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: World Cup 2023: రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఐసీసీ ఒప్పందం.. అందుకోసమే!

తాజాగా తనపై వస్తున్న మీమ్స్‌పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన మంత్రం వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టాడు. నిజానికి తాను ఎలాంటి మంత్రం చదవలేదని పాండ్యా వివరణ ఇచ్చాడు. అప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో తనపై తనకే కోపం వచ్చిందని.. అందుకే తనను తానే తిట్టుకున్నానని తెలిపాడు. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని తనంతట తానే చెప్పుకున్నట్లు వివరించాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాండ్య చెప్పడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాణించి రెండు వికెట్లు సాధించాడు. మొత్తంగా 6 ఓవర్లు వేసిన పాండ్యా.. 34 రన్స్ ఇచ్చి ఇమామ్ ఉల్ హక్‌తో పాటు మహమ్మద్ నవాజ్ వికెట్ పడగొట్టాడు.

Updated Date - 2023-10-16T21:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising