ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPL 2024: అనుకున్నదే జరిగింది.. గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ అతడే..!!

ABN, First Publish Date - 2023-11-27T16:12:25+05:30

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు షిఫ్ట్ కావడంతో నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను నియమించినట్లు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది. గుజరాత్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్‌లో భారీ ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు షిఫ్ట్ కావడంతో నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను నియమించినట్లు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 19న వేలం సందర్భంగా నవంబర్ 26తో రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా అన్ని జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. అయితే చివరి నిమిషంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్‌లో భారీ ధరకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పాండ్యా.. తిరిగి తన సొంత జట్టుకు వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని అభిప్రాయపడ్డాడు.

కాగా టీమిండియా ఓపెనర్‌గా వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ సెంచరీల మీద సెంచరీలు బాదాడు. మొత్తం 17 ఇన్నింగ్స్‌లలో 59.33 సగటు, 157.80 స్ట్రైక్ రేట్‌తో 890 పరుగులు చేసి లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 2022లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పాండ్యా ట్రేడింగ్ తర్వాత గిల్‌కు కెప్టెన్ అవకాశం రావడం గొప్ప విషయం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే విలియమ్సన్, రషీద్ ఖాన్, షమీ, డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ప్లేయర్లను కాదని గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం గుజరాత్ టైటాన్స్ తీసుకున్న దూకుడు నిర్ణయం అని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి కెప్టెన్సీ గిల్ ఫామ్‌కు భారంగా ఉంటుందా లేదా పాండ్యా తరహాలో అతడు రాణిస్తాడా అన్న విషయం వచ్చే సీజన్‌లోనే స్పష్టం కానుంది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T16:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising