ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: గంగూలీ షాకింగ్ కామెంట్స్.. రోహిత్ కెప్టెన్సీ వద్దన్నాడు..!!

ABN, First Publish Date - 2023-11-10T16:02:59+05:30

Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు పగ్గాలను స్వీకరించడానికి రోహిత్ ఇష్టపడలేదని.. అన్ని ఫార్మాట్లు ఆడుతుండటంతో ఆటగాడిగా తనపై చాలా ఒత్తిడి ఉందని చెప్పాడని గంగూలీ తెలిపాడు.

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచప్‌లో ఇప్పటివరకు భారత్ 8 మ్యాచ్‌లు ఆడగా అన్ని మ్యాచ్‌లలో గెలిచి ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది. అయితే బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు రోహిత్ కెప్టెన్ కావాలనుకోలేదని చెప్పాడు. జట్టు పగ్గాలను స్వీకరించడానికి రోహిత్ ఇష్టపడలేదని.. అన్ని ఫార్మాట్లు ఆడుతుండటంతో ఆటగాడిగా తనపై చాలా ఒత్తిడి ఉందని చెప్పాడని గంగూలీ తెలిపాడు. తానే రోహిత్‌ను కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించమని చెప్పానని.. ఒకరకంగా చెప్పాలంటే రోహిత్‌కు ఇష్టం లేకపోయినా బలవంతంగా కెప్టెన్సీ అప్పగించినట్లు పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ స్థానంలో సారథిగా ఉండేందుకు యస్ చెప్తావా.. నీ పేరు కెప్టెన్‌గా అనౌన్స్ చేయమంటావా అని రోహిత్‌ను అడిగామని.. పరిస్థితి ఎలా ఉన్నా అతడు కెప్టెన్సీ స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉందని గంగూలీ అన్నాడు.

అయితే రోహిత్‌ను తాము కెప్టెన్ ఎందుకు చేయాలనుకున్నామో కూడా గంగూలీ కారణాలను విశ్లేషించాడు. అప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నాడని. దీంతో సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకుందని వివరించాడు. అన్ని ఫార్మాట్లలో అతడికి పగ్గాలు అప్పచెప్పడం వెనుక కూడా ఇదే కారణం ఉందన్నాడు. మొత్తానికి రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే విషయంలో పెద్ద తతంగమే నడిచిందని గంగూలీ తాజా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఇండియాకు ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ నిలుస్తాడు. గతంలో కపిల్ దేవ్, ధోనీ మాత్రమే టీమిండియాకు తమ సారథ్యంలో వరల్డ్ కప్ అందించారు. కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ఒకసారి, ధోనీ నాయకత్వంలో రెండుసార్లు భారత్ విశ్వవిజేతగా నిలిచింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T16:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising