ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs AUS Semi Final: టాస్ దక్షిణాఫ్రికాదే.. ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు?

ABN, First Publish Date - 2023-11-16T14:21:23+05:30

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది.

వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది. ఆడమ్ జంపాపైనే ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 1999 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. 1999లో జరిగిన సెమీఫైనల్ టైగా ముగిసింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు ఎక్కువ పాయింట్లు ఉండటంతో ఆ జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లింది. దీంతో సఫారీలకు నిరాశ మిగిలింది. ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఒకవేళ 1999 మాదిరిగా ఈ మ్యాచ్ కూడా టై అయితే ఈసారి సీన్ రివర్స్ కానుంది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా కంటే దక్షిణాఫ్రికాకు లీగ్ దశలో పాయింట్లు ఎక్కువ ఉండటంతో దక్షిణాఫ్రికా ఫైనల్లో అడుగుపెడుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్‌లో కూడా ఫైనల్‌కు వెళ్లి కప్పు కొట్టాలని భావిస్తోంది. 2015లో విన్నర్‌గా నిలిచిన ఈ జట్టు 2019లో మాత్రం సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్టు ఈనెల 19న టీమిండియాతో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.


దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, డుసెన్, మార్‌క్రమ్, మిల్లర్, క్లాసెన్, యాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, రబాడ, షాంసీ

ఆస్ట్రేలియా: వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్, జాష్ ఇంగ్లీస్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్

Updated Date - 2023-11-16T14:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising