SA Vs IND: సిరీస్ డిసైడర్.. వరుసగా మూడోసారి టాస్ ఓడిన భారత్
ABN, Publish Date - Dec 21 , 2023 | 04:39 PM
SA Vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే బోలెండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే బోలెండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకుని భారీ మూల్యం చెల్లించుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం ఫీల్డింగ్ ఎంచుకుని విజయం సాధించింది. దీంతో మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెంటనే మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది.
కాగా మూడో వన్డే కోసం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో అతడి స్థానంలో రజత్ పటీదార్‌ను తీసుకుంటున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. స్పిన్నర్ కుల్‌దీప్‌కు విశ్రాంతి ఇచ్చామని.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతాడని తెలిపాడు. దక్షిణాఫ్రికా మాత్రం రెండో వన్డే ఆడిన జట్టుతోనే మూడో వన్డే ఆడుతుందని కెప్టెన్ మార్‌క్రమ్ వెల్లడించాడు. టీమిండియా ఆటగాడు రజత్ పటీదార్‌కు అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి వన్డే. లిస్ట్-ఎలో 56 మ్యాచ్‌లు ఆడిన అతడు 1963 పరుగులు చేశాడు.
తుది జట్లు:
టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రజత్ పటీదార్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా: రెజా హెండ్రిక్స్, టానీ డిజార్జి, వాండర్ డుసెన్, మార్‌క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ముల్డర్, కేశవ్ మహరాజ్, బర్గర్, లిజాడ్ విలియమ్స్, బెరన్ హెండ్రిక్స్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 21 , 2023 | 04:39 PM