ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: మూడో టీ20.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా

ABN, Publish Date - Dec 14 , 2023 | 08:18 PM

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి తీరాలి. జోహన్నెస్ బర్గ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెనర్లు గిల్, జైశ్వాల్ మూడో టీ20లో చెలరేగి ఆడాలని ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా రెండు మార్పులు చేసింది. మార్కో యాన్‌సన్, గెరాల్డ్ కోయిట్జీ స్థానాల్లో కేశవ్ మహరాజ్, ఫెర్రీర్స్‌ను తీసుకుంది. టీమిండియా మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు:

టీమిండియా: సూర్యకుమార్ (కెప్టెన్), యషస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రెజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డొనొవన్ ఫెర్రీర్స్, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, విలియమ్స్, బర్గర్, షాంసీ


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 14 , 2023 | 08:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising