BAN vs SL: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టైమ్ ఔట్‌కి మాథ్యూస్ బలి.. అసలేంటి ఈ నిబంధన?
ABN, First Publish Date - 2023-11-06T17:06:13+05:30
అప్పుడప్పుడు క్రికెట్ క్రీడలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే.. తాజా అనూహ్య పరిణామం మాత్రం 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న...
అప్పుడప్పుడు క్రికెట్ క్రీడలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే.. తాజా అనూహ్య పరిణామం మాత్రం 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ వింత ఘటన వెలుగు చూసింది. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంతో.. అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అయిన దాఖలాలు లేవు.
అసలేం జరిగింది?
శ్రీలంక బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో భాగంగా.. 24వ ఓవర్‌లో షకీబ్ అల్ హసన్ వేసిన రెండో బంతికి సమరవిక్రమ్ ఔట్ అయ్యాడు. అప్పుడు ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగాడు. అయితే.. క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌కి హెల్మెట్ సమస్య తలెత్తింది. హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో.. మరో దారి లేక మరో హెల్మెట్‌ను పెవిలియన్ నుంచి తెప్పించాడు. ఈ మొత్తం ప్రాసెస్‌కు కొంత సమయం పట్టింది. ఇంతలో షకీబ్ అల్ హసన్ అంపైర్ వద్దకు వెళ్లి, నిర్దేశిత సమయం ముగిసిందని అప్పీల్ చేశాడు.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. మాథ్యూస్‌ని టైమ్ ఔట్‌గా అంపైర్ ప్రకటించాడు. దీంతో ఖంగుతిన్న మాథ్యూస్.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా సమయం వృధా చేసినందుకు.. ఔట్‌గా ఖరారు చేయాల్సి వచ్చిందని అంపైర్ వివరించారు. చివరికి ఏం చేయలేక.. మాథ్యూస్ ఒక్క బంతి కూడా ఆడకుండానే పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ బంగ్లాదేశ్ తన అప్పీల్‌ను వెనక్కు తీసుకుంటే, మాథ్యూస్‌కు బ్యాటింగ్ చేయొచ్చని అంపైర్లు చెప్పారు. కానీ.. బంగ్లాదేశ్ జట్టు మాత్రం తన అప్పీల్‌ని వెనక్కు తీసుకోలేదు.
టైమ్ ఔట్ నిబంధన ఏంటి?
40.1.1 రూల్ ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదా బ్యాటర్ రిటైర్మెంట్ ఇచ్చిన అనంతరం తదుపరి బ్యాటర్ మూడు నిమిషాల్లోపే బంతిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా జరగకపోతే మాత్రం.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ‘టైమ్ ఔట్’కు అప్పీల్ చేయవచ్చు. ఇప్పుడు మాథ్యూస్ విషయంలో అదే జరిగింది. అయితే.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఈ నిర్ణయంతో సంతోషించలేదు. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నాడు. కానీ.. ఇది రూల్ బుక్‌లో ఉంది కాబట్టి, టైమ్ ఔట్‌కి అప్పీల్ చేసే హక్కు బంగ్లాదేశ్‌కి ఉందన్నాడు.
Updated Date - 2023-11-06T17:06:14+05:30 IST