కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI Worldcup 2023: సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ప్రపంచకప్ గెలిచేది టీమిండియా కాదు..!!

ABN, First Publish Date - 2023-09-30T18:26:50+05:30

భారత్, పాకిస్థాన్ జట్లకు ప్రపంచకప్ గెలిచే సత్తా లేదని సునీల్ గవాస్కర్ తేల్చేశాడు. తన అభిప్రాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరోసారి ప్రపంచకప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

 ODI Worldcup 2023: సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ప్రపంచకప్ గెలిచేది టీమిండియా కాదు..!!

టీమిండియా సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. 2011 తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ గెలిచేది టీమిండియా కాదన్నాడు. ఉపఖండం వేదికగా మెగా టోర్నీ జరుగుతున్నా.. భారత్, పాకిస్థాన్ జట్లకు ప్రపంచకప్ గెలిచే సత్తా లేదని సునీల్ గవాస్కర్ తేల్చేశాడు. తన అభిప్రాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరోసారి ప్రపంచకప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు మాత్రమే ఉందన్నాడు. అయితే ఇంగ్లండ్ ఎందుకు మళ్లీ ఛాంపియన్‌గా నిలుస్తుందో కొన్ని కారణాలను కూడా సన్నీ వివరించాడు.

ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండటమే ఆ జట్టు మళ్లీ ఛాంపియన్ కావడానికి అవకాశాలు ఉన్నాయని సునీల్ గవాస్కర్ అన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లు ముగ్గురు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారన్నాడు. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, శామ్ కరణ్ రూపంలో ఆ జట్టుకు నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారని చెప్పాడు. అటు బౌలింగ్ లైనప్‌లో కూడా ఎంతో అనుభవం కలిగిన బౌలర్లు ఉన్నారని వివరించాడు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ రూపంలో మంచి బౌలర్లు ఇంగ్లండ్‌కు ఎప్పుడైనా విజయాలు అందించగలరని పేర్కొన్నాడు. అందుకే తన అంచనా ప్రకారం ఇంగ్లండ్ విజేతగా నిలుస్తోందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Virat Kohli: మళ్లీ తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ

కాగా మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం టీమిండియాకే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందని.. ఆసియాకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో సిరీస్‌లను కైవసం చేసుకుందని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. ప్రధాన జట్టే కాకుండా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని తెలిపాడు. ఉదాహరణకు తీసుకుంటే అవకాశం వచ్చినప్పుడు మహ్మద్ షమీ లాంటి ఆటగాడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-09-30T18:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising