Sunrisers Hyderabad: హెడ్ కోచ్ లారాపై వేటు.. కావ్య పాప సంచలన నిర్ణయం
ABN, First Publish Date - 2023-07-19T18:40:51+05:30
వచ్చే ఏడాది జట్టును ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టుకు మెరుగైన ఫలితాలు అందించడంలో ఈ వెస్టిండీస్ మాజీ స్టార్ క్రికెటర్ విఫలమయ్యాడని సన్‌రైజర్స్ యాజమాన్యం గుస్సా వహిస్తోంది. హెడ్ కోచ్‌తో పాటు పలువురు ఆటగాళ్లపై వేటు వేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కావ్య మారన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టీమ్ ప్రదర్శన దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది అయితే పాయింట్ల పట్టిక(Points Table)లో చివరి స్థానంలో నిలిచి విమర్శల పాలైంది. కేవలం 14 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ముఖ్యంగా వేలంలో కోట్లకు కోట్లు పోసి కొనుగోలు చేసిన ఆటగాళ్లు రాణించకపోవడం సన్‌రైజర్స్‌కు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ యజమానురాలు కావ్య మార(Kavya Maaran)పై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మాములుగా లేవు. కావ్య పాపకు ఎలాంటి టీమ్ కావాలో క్లారిటీ లేదని క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. టీ20 క్రికెట్‌లో నిఖార్సైన ఆటగాళ్లను తీసుకోవడంలో కావ్య పాపకు తెలియడం లేదని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మరోవైపు వచ్చే ఏడాది జట్టును ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారా(Brian Lara)పై వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టుకు మెరుగైన ఫలితాలు అందించడంలో ఈ వెస్టిండీస్ మాజీ స్టార్ క్రికెటర్ విఫలమయ్యాడని సన్‌రైజర్స్ యాజమాన్యం గుస్సా వహిస్తోంది. హెడ్ కోచ్‌తో పాటు పలువురు ఆటగాళ్లపై వేటు వేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కావ్య మారన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లారా ఒకప్పటి టెస్ట్, వన్డే తరహా ఆలోచనలో ఉంటూ అటువంటి ఆటగాళ్లను జట్టులో ఆడిస్తున్నాడనే అభిప్రాయం యాజమాన్యంలో ఉంది. తుది జట్టు ఎంపికలో లారా ఎక్కువ ఇన్వాల్వ్ కావడం వల్ల గతంలో కెప్టెన్ మార్‌క్రమ్ అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని జట్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో లారా స్థానంలో భారత్‌కు చెందిన సీనియర్ రిటైర్డ్ క్రికెటర్‌ను హెడ్ కోచ్‌గా తీసుకోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ICC Test Rankings: అగ్రస్థానంలోనే టీమిండియా స్పిన్ ద్వయం
అటు పలువురు ఆటగాళ్లను వచ్చే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి విడుదల చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్‌క్రమ్ వంటి ఆటగాళ్లపై వేటు వేసేందుకు కావ్య మారన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాళ్ల స్థానంలో వేలంలో వేరే ఆటగాళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా వార్నర్ వంటి సీనియర్ ఆటగాళ్లను దూరం చేసుకోవడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా కోచ్‌గా టామ్ మూడీ తర్వాత వచ్చిన బ్రియాన్ లారా కూడా మెరుగైన ఫలితాలను తీసుకురావడంలో విఫలమవుతున్నాడు. గత రెండేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడంతో టీమ్ ఎంపికపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేయడం తెలిసిందే.
Updated Date - 2023-07-19T18:53:47+05:30 IST