ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: రెండో టెస్టుకు టీమిండియాలో మార్పు.. కొత్త ఆటగాడికి అవకాశం

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:12 PM

SA Vs IND: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో దారుణ పరాజయం చవిచూసిన టీమిండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో టెస్టుకు సంబంధించి ఓ మార్పు చేసింది. గాయపడ్డ సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో యువ బౌలర్, రైటార్మ్ పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇచ్చింది.

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో దారుణ పరాజయం చవిచూసిన టీమిండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో టెస్టుకు సంబంధించి ఓ మార్పు చేసింది. గాయపడ్డ సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో యువ బౌలర్, రైటార్మ్ పేసర్ అవేష్ ఖాన్‌కు అవకాశం ఇచ్చింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో అవేష్ ఖాన్ రాణించాడు. మూడు వన్డేల్లో ఆరు వికెట్లు సాధించాడు. దీంతో రెండో టెస్టు కోసం అతడిని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒకవేళ రెండో టెస్టులో అవేష్ ఖాన్ ఆడితే అతడికి ఇదే తొలి టెస్టు కానుంది.

అవేష్ ఖాన్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 8 వన్డేలు, 19 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 9 వికెట్లు, టీ20లలో 18 వికెట్లు సాధించిన అతడు 22.65 సగటుతో 149 ఫస్ట్ క్లాస్ వికెట్లు సాధించాడు. గత ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై టీ20లలో అరంగేట్రం చేసిన అవేష్ ఖాన్.. అదే ఏడాది జూలైలో జరిగిన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌పైనే అరంగేట్రం చేయడం విశేషం. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అవేష్ ఖాన్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రాణించాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 29 , 2023 | 03:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising