SA Vs IND: రెండో వన్డేలో టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!
ABN, Publish Date - Dec 19 , 2023 | 08:08 PM
SA Vs IND: గబేరా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది.
గబేరా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తొలి ఓవర్‌లోనే అవుటయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం తన ఫామ్ కొనసాగించి వరుసగా రెండో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 83 బాల్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 62 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (10), సంజు శాంసన్ (12), రింకూ సింగ్ (17) విఫలమయ్యారు.
అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఆచితూచి ఆడాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. 64 బాల్స్‌లో 7 ఫోర్ల సహాయంతో 56 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు కనీసం క్రీజులో ఉండేందుకు కూడా ప్రయత్నించలేదు. దీంతో టీమిండియా 250 మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ మూడు వికెట్లు, హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌ను సమం చేయాలంటే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 19 , 2023 | 08:08 PM