ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: ఆదుకున్న కేఎల్ రాహుల్.. తొలిరోజు ముగిసిన ఆట

ABN, Publish Date - Dec 26 , 2023 | 09:01 PM

SA Vs IND: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 59 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), సిరాజ్ (0) ఉన్నారు.

సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 59 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), సిరాజ్ (0) ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో తొలిరోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా వర్షం కురవడంతో టాస్ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆదిలోనే షాక్ తగిలింది. వరుసగా వికెట్లు పడటంతో రోహిత్ సేన కష్టాల్లో పడింది.

బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ పేసర్లు విజృంభించడంతో రోహిత్ (5), జైశ్వాల్ (17), గిల్ (2) వరుసగా అవుటయ్యారు. విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నా వీళ్లిద్దరూ అవుట్ కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అయితే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. ఒక దశలో టీమిండియా 200 పరుగులైనా చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాహుల్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. అశ్విన్ (8), శార్దూల్ ఠాకూర్ (24) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కాగా దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 5 వికెట్లు తీయగా.. బర్గర్ 2 వికెట్లు, మార్కో యాన్‌సన్ ఒక వికెట్ సాధించారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 09:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising