ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: రోహిత్ శర్మ హ్యాట్రిక్ సాధిస్తాడా? క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ..!!

ABN, First Publish Date - 2023-10-17T19:46:43+05:30

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత రెండు ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో మూడో ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఐసీసీ టోర్నీలు అంటే చెలరేగి ఆడే రోహిత్ ఇప్పుడు హ్యాట్రిక్ సాధిస్తాడా అన్న విషయం గురించే క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. గురువారం నాడు పూణె వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించి ఊపు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలని కోరుకుంటోంది. మరోవైపు 2007 ప్రపంచకప్ మాదిరిగా టీమిండియాకు షాక్ ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆరాటపడుతోంది. అయితే ఆ జట్టుకు ఇది తేలీకేమీ కాదు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ గత రెండు ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో మూడో ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకునేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు.

ఇది కూడా చదవండి: ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెంచరీలు చేసింది వీళ్లే..!!

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 217 పరుగులు చేశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో అతడి సామర్థ్యంపై అనుమానాలు చెలరేగాయి. గత వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో చెలరేగిన రోహిత్ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే తదుపరి మ్యాచ్‌లలో రోహిత్ దూకుడుగా ఆడి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 131 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో సెంచరీల జైత్రయాత్రకు నాంది పలికాడు. అంతేకాకుండా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పైనా విరుచుకుపడ్డాడు. 86 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్‌పైనా అతడు వీరబాదుడు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-10-17T19:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising