ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: రాహుల్ ద్రావిడ్ కల ఇప్పుడైనా నెరవేరుతుందా..? పాపం 28 ఏళ్లుగా..

ABN, First Publish Date - 2023-11-19T12:12:03+05:30

Team India head coach Rahul Dravid: రాహుల్ ద్రావిడ్. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసర లేదు. భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన రాహుల్ ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి సమయంలోనైనా వికెట్లకు అడ్డుగోడగా నిలబడి టీమిండియాను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించాడు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ హవా నడుస్తున్న రోజుల్లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అహ్మదాబాద్: రాహుల్ ద్రావిడ్. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసర లేదు. భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన రాహుల్ ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి సమయంలోనైనా వికెట్లకు అడ్డుగోడగా నిలబడి టీమిండియాను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించాడు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ హవా నడుస్తున్న రోజుల్లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. టీమిండియాలో నమ్మకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 16 ఏళ్లపాటు ఆటగాడిగా టీమిండియాకు ఎనలేని సేవలు చేశాడు. టీమిండియాకు కెప్టన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలో 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడి 24 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంత సాధించిన ప్రపంచకప్ గెలవాలనే ద్రావిడ్ చిరకాల కోరిక మాత్రం నెరవేరలేదు. చివరకు ప్రపంచకప్‌ను గెలవడకుండానే రిటైర్ అయ్యాడు. ద్రావిడ్ కెప్టెన్సీలో 2007 ప్రపంచకప్ ఆడిన టీమిండియా దారుణ ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్ల చేతిలో సైతం ఓడి కనీసం లీగ్ దశ కూడా దాటకుండానే ఇంటి దారి పట్టింది. భారత క్రికెట్ చరిత్రలో 2007 ప్రపంచకప్ అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 2011 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సమయంలో ద్రావిడ్ ఇంకా రిటైర్ కాలేదు. కానీ అప్పటికే కుర్రాళ్లు జట్టులోకి దూసుకురావడంతో ద్రావిడ్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో ద్రావిడ్ ప్రపంచకప్ కల నెరవేరదని అంతా భావించారు.


కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక అంతా అయిపోయిందనుకునే సమయంలో మరో అవకాశం ఇస్తుంది. రాహుల్ ద్రావిడ్ విషయంలోనూ అదే జరిగింది. ఆటగాడిగా ప్రపంచకప్ గెలవకపోతేనేం హెడ్ కోచ్‌గా ట్రోఫిని ముద్దాడే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో దూసుకుపోతున్న టీమిండియా ట్రోఫికి అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడిస్తే 20 ఏళ్ల ద్రావిడ్ ప్రతీకారం తీరడంతోపాటు ప్రపంచకప్ గెలుస్తుంది. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. నాడు టీమిండియాకు ద్రావిడ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అదే ద్రావిడ్ ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్నాడు. దీంతో 20 ఏళ్ల క్రితం ఎదురైన దారుణ పరాభవానికి రాహుల్ ద్రావిడ్ ప్రతీకారం తీర్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అదే జరిగితే 28 ఏళ్లుగా ప్రపంచకప్‌ను గెలవాలని ఆశిస్తున్న రాహుల్ ద్రావిడ్ కల నెరవేరనుంది. 2011లో రిటైర్ అయ్యాక రాహుల్ ద్రావిడ్ టీమిండియా జూనియర్ జట్టుకు కోచింగ్ ఇచ్చే బాధ్యతను చేపట్టాడు. భారత్ -ఏ జట్టుకు ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. తన కోచింగ్‌లో యువకులను మెరికల్లా తయారుచేశాడు. నిజానికి ద్రావిడ్‌కు హెడ్ కోచ్‌గా చేసే అవకాశం ముందుగానే వచ్చింది. కానీ ద్రావిడ్ మాత్రం తొందరపడకుండా ముందుగా యువ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం సాధించాక టీమిండియా సీనియర్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచకప్ గెలవడానికి అడుగుదూరంలో ఉన్నాడు.

Updated Date - 2023-11-19T12:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising