SMAT 2023: సెంచరీతో చెలరేగిన తెలుగు తేజం.. బ్యాకప్‌గా జట్టులోకి వస్తాడా?
ABN, First Publish Date - 2023-10-23T15:30:42+05:30
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. జైపూర్ వేదికగా సోమవారం నాడు బరోడాతో టీ20 ఫార్మాట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో అందరి చూపును మళ్లీ తన వైపుకు తిప్పుకున్నాడు.
టీమిండియా ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ మరోసారి తన సత్తా చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టి జాతీయ జట్టులో స్థానం సంపాదించిన తిలక్ వర్మ ఆ తర్వాత సీనియర్లు జట్టులోకి పునరాగమనం చేయడంతో అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున అదరగొడుతున్నాడు. జైపూర్ వేదికగా సోమవారం నాడు బరోడాతో టీ20 ఫార్మాట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో అందరి చూపును మళ్లీ తన వైపుకు తిప్పుకున్నాడు. కేవలం 69 బాల్స్‌లో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇది కూడా చదవండి: Mohammed Shami: వరల్డ్ కప్‌లో పేసర్ మహ్మద్ షమీ రికార్డ్.. ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ సాధించని ఫీట్ ఇది
తిలక్ వర్మ సెంచరీ కారణంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అయితే 187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 18.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. కృనాల్ పాండ్య (64), విష్ణు సోలంకి (71) రాణించడంతో హైదరాబాద్ విధించిన లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది. ముఖ్యంగా విష్ణు సోలంకి 37 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులతో బరోడాను గెలిపించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన తెలుగు తేజం తిలక్ వర్మ 271 పరుగులతో.. టాప్-2 రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇలాగే నిలకడగా ఆడితే తిలక్ వర్మ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఎవరైనా గాయపడినా బ్యాకప్‌గానూ తిలక్ వర్మను ఎంపిక చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా 8 జట్ల ఆడుతున్న ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.
Updated Date - 2023-10-23T15:30:42+05:30 IST