ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ఏ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి?

ABN, First Publish Date - 2023-10-27T19:09:07+05:30

ఆస్ట్రేలియా గడ్డపై 2015లో జరిగిన ప్రపంచకప్‌లో అత్యధికంగా 38 సెంచరీలు నమోదయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర అత్యధికంగా నాలుగు సెంచరీలు బాదాడు.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సెంచరీల మీద సెంచరీలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 21 సెంచరీలు నమోదయ్యాయి. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు బాదారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా నుంచి అత్యధిక సెంచరీలు (6) నమోదయ్యాయి. ఇందులో డికాక్ ఒక్కడే మూడు సెంచరీలు కొట్టాడు. అతడితో పాటు డుసెన్, మార్‌క్రమ్, క్లాసెన్ కూడా శతక్కొట్టారు. పాకిస్థాన్ నుంచి రెండు సెంచరీలు (మహ్మద్ షఫీక్, మహ్మద్ రిజ్వాన్), ఆస్ట్రేలియా నుంచి నాలుగు సెంచరీలు (వార్నర్-2, మిచెల్ మార్ష్-1, మ్యాక్స్‌వెల్-1), శ్రీలంక నుంచి రెండు సెంచరీలు (కుశాల్ మెండిస్, సమరవిక్రమ), న్యూజిలాండ్ నుంచి మూడు సెంచరీలు (రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వాయ్, డారిల్ మిచెల్), బంగ్లాదేశ్ నుంచి ఒక సెంచరీ (మహ్మదుల్లా), ఇంగ్లండ్ నుంచి ఒక సెంచరీ (డేవిడ్ మలాన్) నమోదయ్యాయి.

అయితే వన్డే ప్రపంచకప్ చరిత్ర చూసుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై 2015లో జరిగిన ప్రపంచకప్‌లో అత్యధికంగా 38 సెంచరీలు నమోదయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర అత్యధికంగా నాలుగు సెంచరీలు బాదాడు. ధావన్, గప్తిల్, దిల్షాన్, మహ్మదుల్లా, బ్రెండన్ టేలర్ వంటి ఆటగాళ్లు రెండు సెంచరీల చొప్పున నమోదు చేశారు. అటు ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో 31 సెంచరీలు జాలువారాయి. టీమిండియా వేదికగా జరిగిన 2011 మెగా టోర్నీలో 24 సెంచరీలు వచ్చాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా 2003లో నిర్వహించిన ప్రపంచకప్‌లో 21 సెంచరీలు నమోదయ్యాయి. 2007 (వెస్టిండీస్) ప్రపంచకప్‌లో 20 సెంచరీలు, 1996 (భారత్-పాకిస్థాన్) ప్రపంచకప్‌లో 16 సెంచరీలు, 1988 (భారత్-పాకిస్థాన్) ప్రపంచకప్‌లో 11 సెంచరీలు, 1999 (ఇంగ్లండ్) ప్రపంచకప్‌లో 11 సెంచరీలు, 1983 (ఇంగ్లండ్) ప్రపంచకప్‌లో 8 సెంచరీలు, 1992 (ఆస్ట్రేలియా) ప్రపంచకప్‌లో 8 సెంచరీల చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2023-10-27T19:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising