ICC Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు
ABN, First Publish Date - 2023-12-11T16:05:26+05:30
ICC Award: నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాడినే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల ఆధారంగా ట్రావిస్ హెడ్‌ను విజేతగా ప్రకటించింది.
నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. వన్డే ప్రపంచకప్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. ట్రావిస్ హెడ్ అయితే ఫైనల్లో సెంచరీతో రాణించి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు సెమీఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ రాణించాడు. 48 బాల్స్‌లో 62 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆస్ట్రేలియా ఫైనల్ వరకు రావడానికి మ్యాక్స్‌వెల్ ప్రదర్శన కారణమని చెప్పాలి. ఆప్ఘనిస్తాన్‌తో ఓడిపోయే మ్యాచ్‌ను ఆస్ట్రేలియా గెలిచిందంటే.. మ్యాక్స్‌వెల్ భారీ సెంచరీతో రాణించడమే.
మరోవైపు షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి నాలుగు మ్యాచ్‌లకు అతడిని పక్కనపెట్టినా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 7 మ్యాచ్‌లలోనే 24 వికెట్లు సాధించాడు. శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ ఐదు వికెట్లు అందుకున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ జట్టు తరఫున విశేషంగా రాణించారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాడినే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల ఆధారంగా ట్రావిస్ హెడ్‌ను విజేతగా ప్రకటించింది. ఓటు విలువలో ఐసీసీ ఓటింగ్ అకాడమీకి 90 శాతం, ఫ్యాన్స్‌కు 10 శాతం షేర్ ఉంటుంది. అటు మహిళల విభాగంలో నవంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ నహీదా అక్తర్ నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-11T16:05:36+05:30 IST