ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shubman Gill: గిల్ ప్రతాపం ఇక్కడేనా? అతడి పనైపోయిందా?

ABN, First Publish Date - 2023-07-21T16:34:56+05:30

భారత్‌లో బ్యాటింగ్ పిచ్‌లపై సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ విదేశాల్లో తేలిపోతుండటంతో అతడి సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో గిల్ ఆటతీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టులో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరిన అతడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగులకే ఔట్ అయ్యాడు.

టీమిండియా (Team India) యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐసీసీ (ICC) టోర్నీలు సమీపిస్తున్న వేళ గిల్ పరుగులు చేయలేకపోవడం టీమ్‌కు నష్టం చేకూరుస్తుందని మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌(IPL)లో శతకాల మీద శతకాలతో శుభ్‌మన్ గిల్ దుమ్మురేపాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు వరుస విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాకు గిల్ భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించాడు. అయితే డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో కూడా అతడు పేలవంగా ఆడుతున్నాడు. దీంతో గిల్ పనైపోయిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

భారత్‌లో బ్యాటింగ్ పిచ్‌లపై సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ విదేశాల్లో తేలిపోతుండటంతో అతడి సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల్లో గిల్ ఆటతీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలసట కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించలేకపోయాడని అందరూ భావించారు. కానీ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో సహచరులు భారీగా పరుగులు సాధిస్తుంటే గిల్ మాత్రం విఫలం చెందడం విమర్శలకు తావిస్తోంది. యువ ఆటగాడు యషస్వీ జైశ్వాల్, ఫామ్‌లేమితో సతమతం అవుతున్న కెప్టెన్ రోహిత్ సెంచరీలు చేసిన చోట గిల్ ప్రదర్శన చెత్తగా ఉంది. తొలి టెస్టులో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరిన అతడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగులకే ఔట్ అయ్యాడు. కీలకమైన పుజారా స్థానంలో జట్టులో కొనసాగుతున్న గిల్‌ దారుణంగా ఆడుతున్నాడు.

ఇది కూడా చదవండి: Virat Kohli: కోహ్లీ కెరీర్‌లో 500వ మ్యాచ్.. బీసీసీఐ స్పెషల్ ట్వీట్

ముఖ్యంగా రెండో టెస్టులో టీ20 లాంటి ఇన్నింగ్స్ ఆడాలని గిల్ ప్రయత్నించాడు. దీంతో ప్రతి బంతిని బౌండరీకి తరలించేందుకు చూశాడు. అతడు చేసిన 10 రన్స్‌లో రెండు ఫోర్లు ఉండటం దీనికి నిదర్శనం. అయితే ఫామ్ అందుకోవడానికి క్రీజులో సమయం గడపాల్సిన గిల్ ఇలా ఆడటం చాలా మందికి నచ్చలేదు. బంతి ఎటు వైపు వెళ్తుందో తెలియక సతమతం అవుతున్నాడు. రెండో టెస్టులో రోచ్ వేసిన ఇన్‌స్వింగర్ ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. గిల్ ప్రతాపం బ్యాటింగ్ పిచ్‌లపైనే అని.. బౌలింగ్ పిచ్‌లపై అతడి ప్రదర్శన ఇంతే అంటూ నెటిజన్‌లు మండిపడుతున్నారు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం వస్తే గిల్ జాగ్రత్తగా ఆడాలని.. లేకపోతే అతడి కెరీర్ ముగిసిపోయినట్లే అని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ లాంటి టోర్నీలు త్వరలో జరగాల్సి ఉండటంతో మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడు గిల్ త్వరగా ఫామ్ అందుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - 2023-07-21T16:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising