ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఇద్దరు ఆటగాళ్లు అవుట్..!!

ABN, First Publish Date - 2023-09-13T19:57:57+05:30

పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వాళ్ల స్థానాల్లో షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు.

ఆసియా కప్‌లో గురువారం నాడు కీలక మ్యాచ్ జరగనుంది. ఫైనల్ బెర్త్ కోసం పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగే ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే నెట్ రన్‌రేట్ ప్రకారం శ్రీలంక ముందంజ వేయనుంది. కానీ శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో వాళ్ల స్థానంలో ఇతరులకు సెలక్టర్లు అవకాశం కల్పించారు.

ఇది కూడా చదవండి: Team India: ఎవడ్రా మిమ్మల్ని ఆపేది? రోహిత్-కోహ్లీ కౌగిలింతలపై ఆసక్తికర చర్చ

ఇటీవల సూపర్-4లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీళ్లిద్దరూ మైదానం వీడటంతో 8 వికెట్లు పడిన తర్వాత పాకిస్థాన్ ఆలౌట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు రోజులు గడిచినా హరీస్ రౌఫ్, నసీమ్ షా కోలుకోలేదని పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. హరీస్ రౌఫ్‌కు కండరాల గాయం కాగా.. నసీమ్ షాకు కుడి భుజానికి గాయమైనట్లు పీసీబీ వెల్లడించింది. దీంతో వాళ్లిద్దరూ చికిత్స కోసం స్వదేశానికి వెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వాళ్ల స్థానాల్లో షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు.

Updated Date - 2023-09-13T19:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising