ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chris Gayle Birthday: క్రికెట్‌ అభిమానులకు ఎంటర్‌టైనర్ ఈ యూనివర్సల్ బాస్

ABN, First Publish Date - 2023-09-21T17:06:44+05:30

గేల్ క్రీజులో ఉంటే ఎలాంటి బౌలర్ అయినా వణికిపోవాల్సిందే. అందుకే క్రిస్ గేల్‌ను క్రికెల్ అభిమానులందరూ యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ గేల్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడని చెప్తే అతిశయోక్తి కాదు. గేల్ బరిలో ఉన్నాడంటే చాలు మైదానం మొత్తం సిక్సర్లతో మారుమోగాల్సి్ందే. స్టేడియం ఎక్కడన్నది పాయింట్ కాదు.. బంతిని కసితీరా కొట్టామా లేదా అన్నదే అతడి థియరీ. గేల్ క్రీజులో ఉంటే ఎలాంటి బౌలర్ అయినా వణికిపోవాల్సిందే. అందుకే క్రిస్ గేల్‌ను క్రికెల్ అభిమానులందరూ యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చినా గేల్ లీగ్ క్రికెట్‌తో అందరినీ అలరిస్తున్నాడు. సెప్టెంబర్ 21 అతడి పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1979లో జమైకాలో పుట్టిన గేల్ ఇవాళ్టితో 43 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాడు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సాధించిన యూనివర్సల్ బాస్ నిజ జీవితంలోనూ అందరితో ఫన్‌గా ఉంటాడు.

ఇది కూడా చదవండి: IND vs AUS: తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ ఓపెనర్‌గా రాణించాడు. 301 వన్డేలు, 101 టెస్టులు, 79 ఇంటర్నేషనల్ టీ20లు ఆడాడు. మొత్తంగా అంతర్జాతీయ వన్డేల్లో 10,480 రన్స్ సాధించిన అతడు టెస్టుల్లో 7,215 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 42 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అయితే రెండుసార్లు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత కూడా సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో మాత్రం లెక్కలు మించి రికార్డులు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో 462 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో 14,562 పరుగులు చేసి సత్తా చాటాడు. అటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఇప్పటి వరకు 553 సిక్సర్లు కొట్టాడు. అతడి రికార్డును బద్దలు కొట్టాలని పలువురు క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ఐపీఎల్‌లో కూడా యూనివర్సల్ బాస్ విశేషంగా రాణించాడు. 4,965 రన్స్‌తో పాటు ఐదు ఐపీఎల్ సెంచరీలు బాదాడు. ముఖ్యంగా ఆర్సీబీ తరఫున సెంచరీల మీద సెంచరీలు సాధించాడు. మొత్తం మీద గేల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్ అభిమానులకు అతడు ఓ ఎంటర్‌టైనర్. గేల్ ఆడుతుంటే చాలు మైదానంలో ఫ్యాన్స్‌తో పాటు టీవీలు చూసేవాళ్లకు కిక్కు రావడం ఖాయమనే చెప్పాలి.

Updated Date - 2023-09-21T17:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising